BigTV English

TGPSC: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల!

TGPSC: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల!

Group-4 Merit Candidates list: తెలంగాణ గ్రూప్-4 మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన ధృవపత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన మెరిట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకునేందుకు కమిషన్ వీలు కల్పించింది. ధృవపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలంటూ వారికి సూచించింది. వెబ్ ఆప్షన్స్ చేసుకున్నవారిని మాత్రమే విడతల వారీగా ధృవపత్రాల పరిశీలనకు అనుమతిస్తామని అందులో పేర్కొన్నది. అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సిన రోజువారీ తేదీలను కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్లు తెలిపింది.


Also Read: ఐదు రోజులే గడువు.. తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?

పరిశీలన కోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. కుల ధృవీకరణ సర్టిఫికెట్, బీసీ నాన్ క్రీమీలేయర్, దివ్యాంగ ధృవీకరణ పత్రాలు, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలని సూచించింది. ధృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా ఆ పత్రాలన్నిటినీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అదేవిధంగా అభ్యర్థులకు అదనపు గడువు ఇవ్వబోమని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.


Tags

Related News

Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?

Jobs in ESIC: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు 5 రోజులే ఛాన్స్..?

IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు

Jobs in Indian Railways: 32,438 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయ్..

BHEL: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.65వేల జీతం, ఇంకా నాలుగు రోజులే ఛాన్స్

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

×