BigTV English

Ravneet Singh Bittu: ఎంపీగా ఓడిపోయారు.. అయినా మోదీ ఈయనను కేబినెట్‌‌లోకి తీసుకున్నారు.. ఎందుకంటే?

Ravneet Singh Bittu: ఎంపీగా ఓడిపోయారు.. అయినా మోదీ ఈయనను కేబినెట్‌‌లోకి తీసుకున్నారు.. ఎందుకంటే?

Ravneet Singh Bittu: భారత ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోదీతోపాటు పలువురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఓడిపోయిన ఎంపీలకు ఎవరికీ కూడా కేబినెట్ లో మంత్రులుగా అవకాశం కల్పించలేదు. కానీ, లుథియానా నుంచి ఓడిపోయిన రవ్ నీత్ బిట్టూని మాత్రం ప్రధాని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల ముందు బిట్టూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే, పంజాబ్ లో బీజేపీ ఎదుగుదలకు బిట్టూ చేరిక చాలా కీలకమైందిగా బీజేపీ భావిస్తోంది.


2024 లోక్ సభ ఎన్నికల ముందు వరకు కూడా పంజాబ్ లో శిరోమణి అకాలీదల్ కి బీజేపీ జూనియర్ పార్ట్ నర్ గా ఉంటూ వచ్చింది. కానీ, 2020లో కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాల కారణంగా ఎన్డేయే కూటమి నుంచి ఎస్ఏ డీ బయటకు వెళ్లింది. అప్పటి నుంచి బీజేపీ పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో లూథియానాలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చేతిలో బిట్టూ ఓటమిపాలయ్యారు.

ఓడిపోయినప్పటికీ పంజాబ్ లో బీజేపీ బలోపేతం కావాలంటే బిట్టూని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావించింది. కాగా, పంజాబ్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న ఖలిస్తానీ మద్దతును అరికట్టాలంటే పంజాబ్ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం ఉండాలని బీజేపీ భావించింది. ఇదేకాకుండా, ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బియాంత్ సింగ్ మనవడిగా రవ్ నీత్ సింగ్ బిట్టూకు పేరుంది. అయితే, పంజాబ్ సీఎంగా ఉన్న సమయంలో బియాంత్ సింగ్ హత్యకు గురయ్యారు.


Also Read: మోదీ ప్రమాణస్వీకారం వేళ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

మరో విషయమేమంటే.. 2024 ఎన్నికల్లో ఇద్దరు ఖలిస్తానీ మద్దతుదారులు గెలవడం ఆందోళన కలిగించే అంశం. పంజాబ్ లో అత్యధికంగా 1,97,120 ఓట్ల తేడాతో ఖదూర్ సాహిబ్ నుంచి తీవ్రవాద ఆరోపణల కింద డిబ్రూగఢ్ జైలులో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ గెలిచాడు. ఇటు ఫరీద్ కోట్ లోక్ సభ నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడైనటువంటి సరబ్ జిత్ సింగ్ 70,053 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ అన్ని కారణాల దృష్ట్యా బిట్టూని మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×