E-Paper
Advertisement

U19 Asia Cup 2025: వైభ‌వ్ ను మించిన మొన‌గాడు…16 ఫోర్లు, 9 సిక్సర్లతో డ‌బుల్ సెంచ‌రీ, ఎవ‌రీ అభిజ్ఞాన్ కుందు ?

U19 Asia Cup 2025: వైభ‌వ్ ను మించిన మొన‌గాడు…16 ఫోర్లు, 9 సిక్సర్లతో డ‌బుల్ సెంచ‌రీ, ఎవ‌రీ అభిజ్ఞాన్ కుందు ?
Advertisement

U19 Asia Cup 2025:  అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( U19 Asia Cup 2025 ) భాగంగా మరో యువ కెరటం తెరపైకి వచ్చింది. టీమిండియా కు చెందిన కుర్ర క్రికెటర్ ఏకంగా డబుల్ సెంచరీ చేసి, సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఒక ఆట ఆడుకున్నాడు. అండర్ 19 టీమిండియా కు చెందిన అభిజ్ఞాన్ కుందు అనే కుర్రాడు 121 బంతుల్లో డబుల్ సెంచరీ ( 209) చేసి శభాష్ అనిపించాడు. ఇక ఈ అభిజ్ఞాన్ కుండు డ‌బుల్ సెంచ‌రీలో 16 బౌండ‌రీలు, 9 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మలేషియా వర్సెస్ టీమిండియా ( India U19 vs Malaysia U19 )  మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అభిజ్ఞాన్ కుందు ( ABHIGYAN KUNDU) డబుల్ సెంచరీ చేసి తన సత్తా చాటాడు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

Advertisement

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ అండర్ 19 టీమ్ ఇండియా వర్సెస్ మలేషియా జట్ల మధ్య 10వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా దుమ్ములేపింది. నిర్నిత 50 ఓవర్లు ఆడిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 408 పరుగులు సాధించింది. ఈ సందర్భంగా వైభవ్ సూర్య వంశీ 50 పరుగులతో రాణించగా, త్రివేది 90 పరుగులతో రఫ్ఫాడించాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన అభిజ్ఞాన్ కుందు ( ABHIGYAN KUNDU) 125 బంతుల్లో 209 పరుగులు సాధించాడు. కేవలం 121 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించిన అభిజ్ఞాన్ కుందు, తన ఇన్నింగ్స్ లో మొత్తం తొమ్మిది సిక్సర్లతో పాటు 17 బౌండరీలు సాధించాడు. ఈ దెబ్బకు 50 ఓవర్లలోనే 408 పరుగులు సాధించింది టీమిండియా. ఇక నిర్ణీత 50 ఓవర్లలో 409 పరుగులు చేస్తే మలేషియా విజయం సాధిస్తుంది.

ఇంత క్వీ అభిజ్ఞాన్ కుందు ( ABHIGYAN KUNDU) ఎవరు?

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంటు లో డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన అభిజ్ఞాన్ కుందు 2008 ఏప్రిల్ 30వ తేదీన జన్మించాడు. ఇతను ఎడమ చేతి వాటం ఆటగాడు. వికెట్ కీపర్ కూడా. అంటే మహేంద్రసింగ్ ధోని తరహాలో వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాడు. దానికి తోడు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు. ముంబైకి చెందిన ఇతను ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహించి, అండర్ 19 టీమిండియాలోకి వచ్చాడు. తన 16 సంవత్సరాల లోపే అత్యధిక పరుగులు చేసి ఇండియా బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డులో చోటు కూడా సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇవాళ 209 ప‌రుగులు సాధించి, అండర్ 19 ఆసియా కప్ లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన‌ మొదటి బ్యాటర్ గా రికార్డు లోకి ఎక్కాడు అభిజ్ఞాన్ కుందు.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

 

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×