BigTV English

5 Star Safety Rating for cars : క్రాష్ టెస్ట్‌లో 3 కార్లకు 5 స్టార్ రేటింగ్… అవి ఏవంటే…

5 Star Safety Rating for cars : క్రాష్ టెస్ట్‌లో 3 కార్లకు 5 స్టార్ రేటింగ్… అవి ఏవంటే…

5 Star Safety Rating for cars : వినియోగదారుల్ని ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు ప్రవేశపెడుతున్న కార్ల కంపెనీలు… వారి భద్రతకు కూడా అంతే ప్రాధాన్యమిస్తున్నాయి. అనుకోకుండా వాహనం ప్రమాదానికి గురైనా… అందులో ప్రయాణించేవారికి ప్రాణాపాయం లేకుండా చూసేందుకు… అత్యాధునిక ఫీచర్లతో కార్లను దృఢంగా తీర్చిదిద్దుతున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న 3 కొత్త కార్లు… క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. సెకండ్ జనరేషన్ మెర్సిడెస్ బెంజ్ GLC, MG 4 ఎలక్ట్రిక్, హ్యుండయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ కార్లు… క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సంపాదించాయి.


మెర్సిడెస్ బెంజ్ GLC :

పెద్దలు, పిల్లల రక్షణలో ఈ కారు ఎక్కువ స్కోర్ చేసినా… పాదచారుల రక్షణలో మాత్రం కొన్ని పాయింట్లు కోల్పోయింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్టింగ్ లో మాత్రం 92 శాతం భద్రతా రేటింగ్‌ను పొందింది. వెనుక సీట్లలో ఉన్నవారికి కూడా ఇదే స్థాయి రక్షణ ఉంది. ఇక సైడ్ మొబైల్ బారియర్ ఇంపాక్ట్‌లో డ్రైవర్‌కు మంచి రక్షణను అందించినా… సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టింగ్‌లో మాత్రం ఛాతి రక్షణలో బలహీనత బయటపడింది. సైడ్ ఇంపాక్ట్ సమయంలో సెంటర్ ఎయిర్‌బ్యాగ్ కూడా మంచి రక్షణ ఇచ్చింది. ఇక పిల్లల రక్షణలో ఈ కారు 90 శాతం స్కోరు సాధించింది. ఓవరాల్ గా క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించింది… మెర్సిడెస్ బెంజ్ GLC.


MG 4 ఎలక్ట్రిక్ :

పెద్దల రక్షణలో ఈ కారు 83 శాతం స్కోర్ సాధించింది. డ్రైవర్‌కు ఛాతీ రక్షణ అంతంత మాత్రంగానే ఉన్నా, ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌ల్లో ప్రయాణికులకు తగిన రక్షణను అందించిందీ కారు. పోల్‌ సైడ్ ఇంపాక్ట్ టెస్టింగ్‌లోనూ ప్రయాణీకులకు మంచి రక్షణ లభించింది. వెనుక సీట్లలో ఉన్నవారికి మాత్రం భద్రత పేలవంగా ఉన్నట్లు బయటపడింది. 6 నుంచి 10 ఏళ్ల పిల్లల భద్రత విషయంలో… ఈ కారు మంచి రేటింగ్ పొందింది. ఓవరాల్ గా క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించింది… MG 4 ఎలక్ట్రిక్.

హ్యుండయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ :

క్రాష్ టెస్ట్‌లో క్రెటా మొత్తం 75.78 పాయింట్లు సాధించింది. పెద్దల భద్రతలో 34.72 పాయింట్లు, పిల్లల భద్రతలో 15.56 పాయింట్లు, సేఫ్టీ అసిస్ట్ కేటగిరీలో 14.08 పాయింట్లు, మోటార్ సైక్లిస్ట్ సేఫ్టీ కేటగిరీలో 11.42 పాయింట్లతో… మొత్తం 75.78 పాయింట్లు సాధించింది… క్రెటా. క్రాష్ టెస్ట్ చేసిన ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో పాటు ఏబీఎస్, ఈబీడీ కూడా ఉన్నాయి.

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×