BigTV English

IPL 2023 : ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం..

IPL 2023 : ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం..

IPL 2023 : కొచ్చిలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి.ఈ నెల 23 న వేలం మొదలుకానుంది.అందులో 405 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.వారిలో 273 మంది భారత ఆటగాళ్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. లిస్టులో నలుగురు ఐసీసీ అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఉండటం విశేషం.మొత్తం ఆటగాళ్లలో 119 మందికి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది.282 మంది దేశవాళీ క్రికెట్ ఆడుతూ.తమ జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు.


పది ఫ్రాంచైజీలకు ప్రస్తుతం 87 ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంది. అందులో 30 మంది విదేశీ క్రికెటర్లను తీసుకునే వెసులుబాటు యాజమాన్యాలకు ఉంది.వేలంలో అత్యధిక కనీస ధర… 2 కోట్ల రూపాయలతో… 19 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.ఇందులో భారత ప్లేయర్లు ఎవరూ లేరు. ఇక..కోటిన్నర కనీస ధరతో 11 మంది, కోటి రూపాయల బేస్ ప్రైస్ లో… 20 మంది ఉండగా.. టీమిండియా ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే ఉన్నారు.

రెండు కోట్ల జాబితాలో ఉన్న ఆటగాళ్లను చూస్తే…కౌల్టర్ నైల్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జేమీ ఓవర్టన్, క్రెయిగ్ ఓవర్టన్, అదిల్ రషీద్ ఉన్నారు. వీరితోపాటు ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వాండర్ డుస్సెన్, ఏంజెలో మాథ్యూస్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ ఉన్నారు.


కోటిన్నర జాబితాలో… సీన్ అబాట్, రైలీ మెరెడిత్, జై రిచర్డ్సన్, ఆడమ్ జంపా, షకీబుల్ హసన్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జేసన్ రాయ్, షెర్ఫాన్ రూథర్ ఫర్డ్ చోటు దక్కించుకున్నారు.

కోటి జాబితాలో..మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహమాన్, మోజస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైకేల్ బ్రేస్ వెల్, మార్క్ చాప్ మన్, మార్టిన్ గప్టిల్, కైలీ జేమీసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, హెన్రిచ్ క్లాసన్, తబ్రాజ్ షంషీ, కుశాల్ పెరీరా, రోస్టన్ చేజ్, రఖీమ్ కార్న్ వాల్, షెయ్ హోప్, అకీల్ హొస్సేన్, డేవిడ్ వీస్ ఉన్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×