BigTV English

Biosensor:- బ్రెయిన్‌వేవ్స్‌తో రోబోలను కంట్రోల్ చేసే సెన్సార్..

Biosensor:- బ్రెయిన్‌వేవ్స్‌తో రోబోలను కంట్రోల్ చేసే సెన్సార్..

Biosensor:- ఇప్పటికే మనం ఏమీ మాట్లాడకపోయినా.. మన ఆలోచనను గుర్తించే టెక్నాలజీలు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. నోరు తెరిచి మాట్లాడకపోయినా.. మనసులో ఏముందో కనిపెట్టే యంత్రాలూ ఉన్నాయి. అదే తోవలో కేవలం ఆలోచనలతోనే మిషీన్లను కంట్రోల్ చేసే ఒక బయోసెన్సార్ పరికరాన్ని సిడ్నీకి చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీని సాయంతో రోబోలు లాంటి మిషీన్లు సైతం మన ఆలోచనలను అనుగుణుంగా పనిచేస్తాయి.


రోబోలు అనేవి అసలు ఉంటాయా అని అందరూ అనుకుంటున్న సమయంలోనే ఎంతో అడ్వాన్స్ రోబోలను తయారు చేసి శాస్త్రవేత్తలు అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతటితో ఆగకుండా.. రోబోలలో ఎన్నో కొత్త రకాల రోబోలను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఫుడ్ నుండి టెక్స్‌టైల్ ఇండస్ట్రీ వరకు.. చాలావరకు రంగాల్లో రోబోలను పనిలో పెట్టారు. ప్రస్తుతం టెక్ వరల్డ్‌లో ఉన్న చాలామంది ఉద్యోగులకు రోబోలు స్నేహితులుగా ఉండడమే టెక్నాలజీ పెరిగింది అనడానికి ఉదాహరణ.

ఇప్పటికే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ అనేది తయారయ్యింది. కానీ దీనిని మరింత డెవలప్ చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ముందుగా దీనిని డిఫెన్స్ రంగంలో ఉపయోగించడం కోసం తయారుచేశారు. కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, హెల్త్ కేర్ట‌లో కూడా ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హెల్త్ సెక్టార్‌లో ఈ టెక్నాలజీ కొన్ని దేశాల్లో అందుబాటులో ఉంది. పక్షవాతం వచ్చినవారు వీల్‌చైర్‌ను కంట్రోల్ చేయడంలాంటిది కూడా ఈ టెక్నాలజీలో భాగమే.


హ్యండ్స్ ఫ్రీ, వాయిస్ ఫ్రీ టెక్నాలజీతో ఈ బయోసన్సార్ తయారు కానుంది. కేవలం చేతి కదలికతో, ఆలోచనతో రోబోలను ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ సెన్సార్లను మనుషులను ధరించేలాగా తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ధరించినా కూడా వారి చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా దీని తయారీ జరగనుంది. అందుకే వీటిని గ్రాఫేన్ సెన్సార్స్ అని కూడా అంటారు. ఇవి వినియోగించడానికి సులువుగా ఉండేలా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

హెక్సాగన్ ఆకారంలో ఉండే ఈ సెన్సార్లు.. మెడ వెనుక భాగంలో ధరించాల్సి ఉంటుంది. కంటి కదలికలతో బ్రెయిన్‌వేవ్స్‌ను ఇది కనిపెడుతుంది. ఎలాంటి వాతావరణంలో అయినా ఈ సెన్సార్లు పనిచేసేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా ఈ బ్రెయిన్‌వేవ్స్‌ను ఆపరేటర్ కనిపెట్టి దానిని డికోడ్ చేసి కమాండ్స్ రూపంలో రోబోలకు అందిస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఆర్మీ.. ఈ సెన్సార్‌తో పరీక్షలు చేసింది. తమ కమాండ్స్‌ను రోబోటిక్ డాగ్ 94 శాతం కరెక్ట్‌గా కనిపెట్టిందని వారు తెలిపారు.

నిసార్ కోసం చేతులు కలిపిన నాసా, ఇస్రో..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×