BigTV English

Musk: మస్క్‌కు బంపరాఫర్‌

Musk: మస్క్‌కు బంపరాఫర్‌

ట్విట్టర్ కొన్నాక సంపద కరిగిపోతూ అనేక కష్టాల్లో ఉన్న మస్క్‌కు బంపరాఫర్‌ ఏంటని అనుకుంటున్నారా? ఇది ట్విట్టర్ విషయంలో కాదు లెండి. ప్రపంచ దేశాల్లో భారీగా గిగా ఫ్యాక్టరీలను స్థాపించాలనుకుంటున్న మస్క్‌కు… ఆ దిశగా ఈ బంపరాఫర్ వచ్చింది. తమ దేశంలో గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పాలని సౌత్‌ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్… మస్క్‌కు జాక్ పాట్ ఆఫర్‌ ఇచ్చారు.


ఇండోనేషియాలో 10 రోజుల కిందటే జరిగిన వాణిజ్య సదస్సులో యోల్‌తో మస్క్‌ భేటీ అయ్యి గిగా ఫ్యాక్టరీ వివరాలు చెప్పాలనుకున్నారు. కానీ, ట్విట్టర్ వ్యవహారాలతో తీరిక లేకుండా ఉన్న మస్క్… యోల్‌తో భేటీ కాలేకపోయారు. తాజాగా యోల్‌తో వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న మస్క్… గ్లోబల్ టెక్నలజికల్ ఇన్నోవేషన్‌పై చర్చించారు. అమెరికా, జర్మనీలో ఇప్పటికే 5 గిగా ఫ్యాకర్టీలు ఉండగా… వచ్చే ఏడాది ఆసియా దేశాల్లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ఆలోచలో ఉన్నామని, ప్రస్తుతం స్థల అన్వేషణలో ఉన్నామని మస్క్ యోల్‌తో చెప్పారు. దాంతో… దక్షిణ కొరియాలో టెస్లా కార్ల విడిభాగాలు తయారు చేసే గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోల్ మస్క్‌ను ఆహ్వానించారు. దీనికి స్పందించిన మస్క్… కొరియాను అగ్రశ్రేణి పెట్టుబడిదారుల్లో ఒక దేశంగా పరిగణిస్తున్నామని… వర్క్‌ ఫోర్స్‌, టెక్నాలజీ, ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణం లాంటివన్నీ సమీక్షించి… తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొరియన్ కంపెనీలతో సప్లయ్ చైన్ సహకారం గణనీయంగా విస్తరిస్తుందని, వచ్చే ఏడాది కొరియన్ కంపెనీల నుంచి విడిభాగాల కొనుగోళ్లు 10 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాఖ్యలతో సౌత్‌ కొరియా ఆటోమొబైల్‌, ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి.

మరోవైపు… మస్క్ వైఖరిని భారత్, రష్యా తీవ్రంగా తప్పుబట్టాయి. గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో సంప‍్రదింపులు జరిపి నెలలు గడుస్తున్నా మస్క్ నిర్ణయం తీసుకోకపోవడంపై రష్యా ఆగ్రహంతో ఉంది. భారత్‌ విషయంలోనూ మస్క్ తీరు అలాగే ఉంది. టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని మస్క్ కోరితే… దేశంలో ఫ్యాక్టరీ నెలకొల్పితే సుంకాల తగ్గింపును పరిశీలిస్తామని భారత్ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత రష్యా, ఇండియాతో మస్క్ సంప్రదింపులు జరపలేదు. తాజాగా సౌత్‌ కొరియా మస్క్‌ను ఆహ్వానించడం… టెస్లాకు శుభ పరిణామమంటున్నారు… నిపుణులు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×