BigTV English

Study of Human Emotions: మనిషి ఎమోషన్స్‌ను గుర్తుపట్టే కంప్యూటర్ మోడల్..

Study of Human Emotions: మనిషి ఎమోషన్స్‌ను గుర్తుపట్టే కంప్యూటర్ మోడల్..

Study of Human Emotions : కృత్రిమ మేధస్సు, కంప్యూటర్ మేధస్సు అనేది ఎంత మనిషి మేధస్సుకు మించి ఉన్నా కూడా.. అది మనిషి ఎమోషన్స్‌ను అర్థం చేసుకోలేదని ఇప్పటికే చాలామంది తమ వాదనలను వినిపిస్తూ ఉన్నారు. అందుకే మెషీన్లు కూడా మనుషుల ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే విధంగా తయారు కావాలని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టెక్ మార్కెట్లోకి వచ్చిన ఏఐ అనేది ఈ సమస్యకు ఒక పరిష్కారం అందిస్తుందని వారు భావిస్తున్నారు.


ఏఐ అనేది కంప్యూటర్లకు మనుషుల ఎమోషన్స్‌ను గుర్తుపట్టే సామర్థ్యాన్ని అందిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కోణంలో పరిశోధనలు మొదలయ్యాయని అన్నారు. మనిషి బ్రెయిన్ యాక్టివిటీని తెలుసుకునే ఈఈజీ లాంటి పరీక్షలను ఏఐతో స్టడీ చేయించారు శాస్త్రవేత్తలు. ఆపై కంప్యూటర్ మోడల్‌కు దానిని జతచేశారు. దీంతో ఇది మనుషుల ఎమోషన్స్‌ను దాదాపు 98 శాతం కరెక్ట్‌గా గుర్తిస్తుందని వారు బయటపెట్టారు. ఇప్పటికీ ఈ కోణంలో జరిగిన పరీక్షలు అన్ని సక్సెస్‌ఫుల్ అయ్యాయని వారు అన్నారు.

ట్రైనింగ్ డేటా, ఆల్గరిథం ద్వారా కంప్యూటర్లు కూడా మనిషి మెదడును స్టడీ చేయగలవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇతర విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే కంప్యూటర్లకు మనుషుల ఎమోషన్స్‌ను స్టడీ చేయడానికి కూడా ట్రైనింగ్ ఇస్తే దాని పని అది కరెక్ట్‌గా చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. మనుషుల ఎమోషన్స్‌ను అర్థం చేసుకోవడం కోసం కంప్యూటర్‌కు నేర్పిస్తున్న ఈ విద్యను ‘గాన్’ అంటారని తెలిపారు. ముఖ్యంగా ఇది మనిషి ఈఈజీతోనే సాధ్యమని అన్నారు.


మ్యూజికల్ స్టిములేషన్ ద్వారా గాన్ అనేది సాధ్యపడిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీనిని కూడా ఒక మోడల్ లాగా పరిగణించామని తెలిపారు. మొత్తానికి ఈ గాన్ అనేది మనుషుల ఎమోషన్‌ను 98.2 శాతాన్ని కనిపెడుతుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా గాన్‌ను మరింత మెరుగ్గా తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కోపాన్ని, ఆందోళనను మరింత మెరుగ్గా కనిపెట్టే విధంగా గాన్‌ను తయారు చేయడమే వారి లక్ష్యమని అన్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×