Vaginal Ring: గర్భనిరోధక పద్ధతుల్లోకి కొత్తగా చేరింది వెజైనల్ రింగ్. ఇది మహిళల కోసం మాత్రమే తయారుచేశారు. లైంగిక చర్యలో పాల్గొంటున్నప్పుడు ఈ రింగ్ పెట్టుకుంటే చాలు గర్భం రావడం అసాధ్యం. ఇప్పటికే గర్భనిరోధక పద్ధతులు అనేకం వాడుకలో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా మహిళలు వాడేది గర్భనిరోధక మాత్రలు.
నిజానికి గర్భనిరోధక మాత్రలను అధికంగా వాడడం వల్ల వారి ఆరోగ్యం పై ఎంతో ప్రతికూల ప్రభావం పడుతుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అందుకే పిల్స్ వాడడానికి భయపడుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. గర్భనిరోధక మాత్రలకు బదులు మహిళలకు అనువుగా ఉండే యోని రింగ్ ను కొత్తగా కనిపెట్టారు. ఇది చాలా సన్నగా ఉండే రింగ్. ఎంతో సౌకర్యవంతంగా వాడవచ్చు.
యోని రింగ్ అనేది మహిళల్లో గర్భనిరోధక పద్ధతికి వాడే ఒక చిన్న సౌకర్యవంతమైన వృత్తాకార పరికరం. దీన్ని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. చాలా సులువుగా దీన్ని యోనిలో పెట్టుకోవచ్చు. ఇది గర్భాన్ని నిర్వహించడానికి కావాల్సిన హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ను కలిపిన హార్మోన్లను ఇది విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు అండోత్సర్గాన్ని ఆపుతాయి. కాబట్టి గర్భం ధరించడం దాదాపు అసాధ్యం.
ఈ రింగ్ ను ఒకసారి ధరిస్తే మూడు వారాలు పాటు వాడవచ్చు. ఆ మూడు వారాల తర్వాత ఒక వారం పాటు దీన్ని వాడకూడదు. ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే సమయంలో వాడకుండా ఉండాలి. పీరియడ్స్ పూర్తయిన తర్వాత మళ్లీ కొత్త రింగును కొని వాడాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా గర్భాన్ని నిరోధించవచ్చు.
యోనిలో పెట్టిన తర్వాత ఈ రింగ్ గోడల ద్వారా రక్త ప్రవాహంలోకి ఈస్ట్రోజన్, ప్రోజెస్టరాన్ హార్మోన్లను స్థిరంగా తక్కువ మోతాదులో విడుదల చేస్తూనే ఉంటుంది. అవి నిత్యం స్రవిస్తూనే ఉంటాయి. కాబట్టి గర్భధారణ అసాధ్యంగా మారుతుంది. అండాశయాలు ప్రతినెలా అండాన్ని విడుదల చేయకుండా ఈ హార్మోన్లు నిరోధిస్తాయి. ఈ రింగులో ఉన్న ప్రొజెస్టరాన్ గర్భాశయంలోని శ్లేష్మాన్ని చిక్కగా మారుస్తుంది. స్పెర్మ్… గర్భాశయం గుండా ఈదడానికి చాలా కష్టపడుతుంది. విడుదలైనా కూడా దాన్ని వీర్యకణాలు చేరుకోలేవు. కాబట్టి గర్భం ధరించడం దాదాపు కష్టమే.
Also Read: మీ వయస్సు ఎంత? ఈ ఏజ్‌లో మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా? ఇది పాటించకపోతే పైకిపోతారట!
యోని రింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుందని ఇప్పటికే పరిశోధనలు చెప్పాయి. ఈ ఉంగరాన్ని యోనిలో పెట్టే ముందు చేతులను పరిశుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. బొటనవేలు, చూపుడువేలు మధ్య ఈ ఉంగరాన్ని పట్టుకొని యోనిలోకి ఉంగరాన్ని సున్నితంగా పెట్టండి. ఇది పెట్టేటప్పుడు ఎలాంటి నొప్పి రాదు.
ఈ వెజైనల్ రింగ్ పెట్టుకున్న తర్వాత లైంగిక చర్యలో ఎలాంటి మార్పు రాదు. ఇది ఒక జనన నియంత్రణ పరికరం మాత్రమే. సెక్స్ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందిని కలిగించదు. కనీసం ఆ రింగ్ ఉన్న సంగతిని కూడా మీరు మర్చిపోతారు. ఎలాంటి అనుభూతిని చందరు. ఇది చాలా మృదువుగా ఉంటుంది. సాధారణ లైంగిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయాన్ని కలిగించదు.
గర్భనిరోధక మాత్రలు, ఇతర పద్ధతుల కన్నా యోని రింగ్ అనేది మహిళలకు ఉత్తమమైన జనన నియంత్రణ పద్ధతి అని చెప్పుకోవచ్చు. గర్భనిరోధక మాత్రలను తరచుగా వాడడం వల్ల స్త్రీలు తీవ్ర అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. వీటిని వేసుకోవడం వల్ల కొందరిలో వికారం, తలనొప్పి, పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అధికంగా అవ్వడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే మరికొందరిలో తీవ్రమైన సమస్యలు కూడా కనిపించవచ్చు. గుండెపోటు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు వారికి వచ్చే అవకాశం పెరుగుతుంది.
అలాగే రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టే ప్రమాదం పిల్స్ వాడే మహిళల్లో ఎక్కువ. ధూమపానం చేసే మహిళలు, ఊబకాయంతో ఉన్న మహిళలు, కుటుంబంలో ఎవరికైనా రక్తం గడ్డకట్టే చరిత్ర ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వినియోగించడం మానేస్తేనే మంచిది. దీర్ఘకాలికంగా వీటిని తీసుకుంటే మహిళల్లో లైంగిక కోరికలు తగ్గిపోతాయి. అలాగే వారి చర్మం మీద మచ్చలు లాంటివి రావచ్చు. తరచూ తలనొప్పి బారిన పడడం కూడా జరుగుతుంది. కాబట్టి అతిగా గర్భనిరోధక మాత్రాలను వాడకపోవడమే మంచిది. వాటి బదులు ఇలాంటి యోని రింగును ఎంచుకోవడం ఉత్తమమైన పద్ధతి.