Actor Bramhaji : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ (Viswaksen) నటించిన తాజా చిత్రం లైలా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. సాహు గారపాటి నిర్మించాడు. ఈ చిత్రం వాలంటైన్స్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ మూవీ మొదటి షో తోనే యావరేజ్ టాక్ ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన కూడా నటుడు పృథ్వీ రాజ్ ( Pruthviraj) అన్న మాటలు మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మ్యాటర్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ పృథ్వీ పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మజీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని పృథ్వీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది..
లైలా ఈవెంట్ లో పృథ్వీ రాజ్ వ్యాఖ్యలు..?
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 150,11 అంటూ సినిమాలోని తన క్యారక్టర్ గురించి చెప్పాడు. అయితే అది రాజకీయాలకు సింక్ అయ్యేలా ఉందని వైసీపీ అభిమానులు సీరియస్ అయ్యారు. దాంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అయ్యింది. ఇంకా లైలా మూవీని బాయ్ కాట్ చేస్తామని ట్రెండ్ చేశారు. కానీ పృథ్వీ మాత్రం నాకు ఏ సంబంధం లేదు. నేను ఎవరిని అనలేదు అన్నారే తప్ప క్షమాపణలు చెప్పలేదు. దాంతో ఆగ్రహించిన నేతలు నెట్టింట పృథ్వీ రాజ్ పై అస్త్రాలను వదిలారు. ఇక రీసెంట్ గా పృథ్వీ సైబర్ క్రైమ్ ను అశ్రయించారు. అక్కడితో గొడవ తగ్గిందని అనుకున్నారు. కానీ దాని ఎఫెక్ట్ సినిమా పై పడిందని తాజాగా వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై నటుడు బ్రాహ్మజీ స్పందించారు. ఈ ఇష్యు మొత్తం ఆయన వల్లే అని కామెంట్స్ చేశారు. దాంతో మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది.
Also Read : పవన్ కళ్యాణ్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. పరువు తీసేశాడుగా..
బ్రహ్మజీ ఏమన్నారంటే..?
టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మజీ( Bramhaji ) బాపు మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..లైలా ఈవెంట్‌లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్‌కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్‌లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని అన్నారు.. సినిమాల కోసం వచ్చి పాలిటిక్స్ మాట్లాడటం సరికాదు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలకు కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎవరైన ఫంక్షన్లో ఆ ఫంక్షన్ గురించి మాట్లాడాలి గురించి లేదా పర్సనల్ ఫ్యామిలీ గురించి మాట్లాడడం భావ్యం కాదని బ్రహ్మాజీ అన్నారు. ప్రస్తుతం బ్రహ్మాజీ వీడియో వైరల్ అవడంతో నెటిజెన్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మెగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పు అంతా పృథ్వీ దే అని చెప్పాడు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం దుమారం రేపుతుంది.. ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది..