Biggest Disaster Movies In Tollywood : సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ సినిమాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఈరోజు టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.
ఎన్టీఆర్ మహానాయకుడు (NTR : Mahanayakudu)
పేరుకు తగ్గట్టే ఎన్టీఆర్ మహానాయకుడు మహా డిజాస్టర్ గా మిగిలింది. సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన వారసుడు బాలయ్య క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమాను తీశారు. ఈ మూవీని బాలయ్య హీరోగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా తీశారు. అయితే ఈ రెండు భాగాల్లోనూ ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు, వివాదాలు లేకుండానే సినిమాను సింపుల్ గా తీశారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఎన్టీఆర్ జీవితంలో లెక్కలేనని వివాదాలు ఉన్నాయి. మొత్తానికి ఈ మూవీ రెండు భాగాలు కూడా ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచిపోయాయి. మూవీని ఏపీలో చాలా ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించినప్పటికీ ప్రేక్షకులు కనీసం అటువైపు తొక్కి చూడలేదు. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి 20 కోట్లయినా వచ్చాయి. కానీ మహా నాయకుడు మూవీకి మాత్రం కనీసం 5 కోట్లు కూడా రాలేదు. దాదాపు 50 కోట్ల వరకు ఎన్టీఆర్ బయోపిక్ బయ్యర్లను అడ్డంగా ముంచేసింది.
బ్రో (Bro)
టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కూడా ఉంది. ఈ మూవీ పవన్ కెరీర్ లోనే చెత్త రికార్డును క్రియేట్ చేసింది. 2023 లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మూవీ విఫలమైంది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదయ సీతం’ అనే మూవీకి దీన్ని రీమేక్ గా తీసుకొచ్చారు. డివోషనల్ సబ్జెక్టుతో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 97.5 కోట్ల బిజినెస్ చేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీకి కేవలం 67.40 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 31 కోట్లకు పైగా నిర్మాతలు నష్టపోయినట్టు టాక్ నడిచింది.
గేమ్ ఛేంజర్ (Game changer)
‘గేమ్ ఛేంజర్’ మూవీని డిజాస్టర్ కా బాప్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ 2025 లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చరిత్రను క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలై నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది ఈ సినిమా. దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన అత్యంత ఖరీదైన ఈ మూవీ 13 రోజుల్లో కేవలం 128 కోట్లకే పరిమితమైంది. దీంతో నిర్మాతలకు 370 కోట్ల మేర నష్టాలను తీసుకొచ్చి పెట్టింది.
ఆచార్య (Acharya)
మెగా ఫ్యామిలీ ఖాతాలో పడ్డ మరో మెగా డిజాస్టర్ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా టాక్ తెచ్చుకుంది.
లైలా (Laila)
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. పలు వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చెత్త సినిమాగా ఈ మూవీ రికార్డును క్రియేట్ చేసింది.