Mrunal Thakur:అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు చేసే పోస్టులు అనుమానాస్పదంగా.. ఆశ్చర్యకరంగా ఎలా అర్థం చేసుకోవాలో తెలియని విధంగా ఉంటాయి. వాళ్లు పెట్టే పోస్టులు ఏంటో అర్థం కాక సోషల్ మీడియా నెటిజన్లు జుట్టు పీక్కుంటారు. అలా వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు షేర్ చేసిన సమయంలో కూడా ఆ సెలబ్రిటీల అభిమానులకు ఏదీ అర్థం కాదు.అలాంటి పోస్టే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అభిమానులందరినీ ఇరకాటంలో పెట్టింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)..
తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మృణాల్ ఠాకూర్ మెహందీ పెట్టుకున్న చేతులతో తన పెంపుడు పిల్లిని పట్టుకొని..” నువ్వు పెళ్లి చేసుకొని వెళ్తున్నప్పుడు నీ పెంపుడు పిల్లికి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని” అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ అర్ధం ఏంటి? మృణాల్ రహస్యంగా పెళ్లి చేసుకుందా ? అనే విషయం అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. మరి ఇంతకీ మృణాల్ పెట్టిన పోస్టు అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రహస్యంగా మృణాల్ పెళ్లి..
మృణాల్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ తో డెకాయిట్ మూవీ (Decoit Movie)లో చేస్తోంది.ఈ మూవీలో మొదట శృతిహాసన్ (Shruti Haasan)ని హీరోయిన్ గా తీసుకున్నారు.కానీ ఆమె తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ కి ఆఫర్ వచ్చింది. అయితే అలాంటి మృణాల్ సినిమాల్లో అంత యాక్టివ్ గా లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో మెహందీ చేతులతో పిల్లిని పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ‘పెళ్లి చేసుకుని వెళ్ళినప్పుడు పెట్ క్యాట్ కి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది’ అని క్యాప్షన్ పెట్టడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదేంటి మృణాల్ రహస్యంగా పెళ్లి చేసుకుందా? అందుకే ఈ పోస్ట్ పెట్టిందా అని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఆ పోస్ట్ కి అర్థం..
అయితే మృణాల్ ఠాకూర్ పెట్టిన ఆ పోస్ట్ లో ఉన్న చేతులు ఎవరివో కానీ ఆ చేతులకు మెహేందీ ఉండడంతో పాటు పెళ్లి అని ప్రస్తావించడంతో చాలామంది మృణాల్ రహస్యంగా పెళ్లి చేసుకుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఆ చేతులు మృణాల్ ఠాకూర్ వేనా.. లేక తనకు సంబంధించిన వేరే ఎవరి గురించైనా ఈ పోస్ట్ పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.
మృణాల్ ఠాకూర్ కెరియర్..
ఇక మృణాల్ ఠాకూర్ పర్సనల్ విషయానికొస్తే.. ఆమె రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సమయంలో నాకు ఈ మధ్యనే బ్రేకప్ అయ్యింది. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను రిజెక్ట్ చేశాడు. ఆయన, నేను సంస్కారవంతమైన కుటుంబం నుండి వచ్చామని, సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న హీరోయిన్ తో డేటింగ్ చేయడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని నన్ను పక్కన పెట్టానని చెప్పాడు. ఆయన మాటలతో నా హార్ట్ బ్రేక్ అయ్యింది” అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ALSO READ:Shobha Shetty: శోభా ఈజ్ బ్యాక్.. ఆ షోలో దర్శనమిచ్చిన బ్యూటీ!