Shobha Shetty: శోభా శెట్టి (Shobha Shetty).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన ‘కార్తీకదీపం’ సీరియల్ లో మోనిత (Monitha ) క్యారెక్టర్ లో విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో వంటలక్కను ఇబ్బంది పెడుతూ.. డాక్టర్ బాబును తన వశం చేసుకునే క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించింది. ఇకపోతే ఈ సీరియల్ ద్వారా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ (Premi Vishwanath) కి ఎంత మంచి పేరు అయితే వచ్చిందో ఇందులో విలన్ గా చేసిన శోభా శెట్టి కి కూడా దాదాపు అంతే పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా కార్తీకదీపం సీరియల్ పూర్తవగానే ఈమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. అక్కడ కూడా తన రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది శోభా శెట్టి.
సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చిన శోభా శెట్టి..
ఇక్కడ టాప్ ఫైవ్ వరకు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెపై నెగెటివిటీ ఏర్పడడంతో మధ్యలోనే ఎలిమినేట్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయనుకున్నారు. కానీ ఆమె క్యారెక్టర్ పై నెగిటివిటీ పెరిగిపోవడంతో ‘కార్తీకదీపం 2 నవ వసంతం’ సీరియల్లో అవకాశాన్ని కోల్పోయింది.
దీంతో సినిమాలలో అవకాశాలు లేక ఇటు సీరియల్స్ లో చాన్స్ ఇవ్వక ఇంటికే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్గా ఉంటూ రోజుకోక గ్లామర్ ఫోటోషూట్ తో అభిమానులను అలరిస్తూ తెగ సందడి చేసిన శోభా శెట్టి సడన్గా సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టి అభిమానులను నిరాశపరిచింది.
శోభా శెట్టి ఈజ్ బ్యాక్ ఫొటోస్ వైరల్..
కొద్దిరోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు కంగారుపడుతూ అసలు ఏం జరిగిందని కామెంట్లు చేశారు. దీంతో కొన్ని రోజులు అని చెప్పింది ఎన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేయగా.. మళ్లీ సడన్గా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆమెను చూసిన అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబోతున్నారు. శోభా ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే శోభాశెట్టి షేర్ చేసిన ఫోటోలను బట్టి చూస్తే ఈమె శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” షో లో సందడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే త్వరలోనే ఈ ఎపిసోడ్ కూడా ప్రసారం కానున్నట్లు సమాచారం.
తాజాగా బ్లూ కలర్ వెల్వెట్ వన్ పీస్ డ్రెస్ ధరించి అందాలతో ఆకట్టుకుంది. శోభా గ్లామర్ చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తానికి అయితే శోభ మళ్లీ సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:AA22 x A6: పూజా కార్యక్రమాలు మొదలు.. షూటింగ్ డేట్ ఫిక్స్!