WTC 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ (World Test Champion Trophy 2025 Final ) మ్యాచ్ పైన పడింది. బుధవారం అంటే ఇవాల్టి నుంచి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
ఐదు రోజులపాటు కొనసాగనున్న ఫైనల్ మ్యాచ్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో… ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా (Australia vs South Africa ) మధ్య జరిగే మ్యాచ్ ఐదు రోజుల పాటు కొనసాగనుంది. రెండు జట్ల మధ్య… ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి.. టెంబా బావుమా పై పడింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ గా.. 100% సక్సెస్ రేట్ సంపాదించాడు టెంబా బావుమా. ఇప్పటి వరకు టెంబా బావుమా టెస్ట్ కెరియర్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా దక్షిణాఫ్రికా ఓడిపోలేదు. ప్రతి సిరీస్ గెలిచింది దక్షిణాఫ్రికా. ఇలాంటి నేపథ్యంలో అటు ఆస్ట్రేలియా కూడా చాలా బలంగా ఉంది. ఫైనల్ దాకా ఆస్ట్రేలియా వస్తే కచ్చితంగా విజయం… సాధించిన దాఖలాలు ఎక్కువ. మరి ఇలాంటి నేపథ్యంలో టెంబా బావుమా వర్సెస్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు అన్నట్లుగా మ్యాచ్ కొనసాగనుంది.
సలార్ రేంజ్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ( Temba Bavuma)
ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య WTC ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… టెంబా బావుమాను ప్రభాస్ లాంటి హీరోలాగా చూస్తున్నారు. దక్షిణాఫ్రికా జట్టును కాపాడేందుకు వచ్చిన వీరుడు అని సెటైర్లు పేల్చుతున్నారు. అతని సారధ్యంలో దక్షిణాఫ్రికా ఖచ్చితంగా చాంపియన్ అవుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ జరిగే మ్యాచ్ లో కూడా.. దక్షిణాఫ్రికా విజయం సాధిస్తుందని చెబుతున్నారు. సలార్ సినిమాలో.. బాధితులను కాపాడినట్లుగానే ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికాను కాపాడుతాడని బహుమానం ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.
దక్షిణాఫ్రికా VS ఆస్ట్రేలియా జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్(కెప్టెన్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి న్గిడి
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ(కెప్టెన్), పాట్ కమ్మిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
?igsh=MWp5Mzg3YzZ4ZDJ4ag==