BigTV English

Advantages regarding Global warming : దుమ్ము, ధూళి వల్ల ఉపయోగాలు.. కనుగొన్న శాస్త్రవేత్తలు..

Advantages regarding Global warming : దుమ్ము, ధూళి వల్ల ఉపయోగాలు.. కనుగొన్న శాస్త్రవేత్తలు..

Advantages regarding Global warming : ఎడారి నుండి వచ్చే దుమ్ము గత కొన్ని దశాబ్దాలుగా భూమి వాతావరణన్ని నిలకడగా ఉండేలా చేస్తోంది. దీని వల్లే గ్లోబల్ వార్మింగ్ వల్ల జరిగే నష్టాలు పూర్తిగా బయటపడలేదని ఇటీవల ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. యూసీఎల్‌ఏ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. 1880 నుండి గాలిలో ఈ దుమ్ము 55 శాతం పెరిగింది. దీని వల్ల గాలిలో కార్బన్ కలుషితాలు 8 శాతం పెరిగాయి.


శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరీక్షల్లో దుమ్ము అనేది భూ వాతావరణంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందని గమనించారు. దుమ్ము వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్‌ల వల్ల కలిగే వేడి తగ్గుతుందని వారు తెలిపారు. దుమ్ములో కాలుష్యం ఉన్నా కూడా అది పలురకాలుగా భూమిని చల్లబరచడానికి ఉపయోగపడుతుందని వారు అన్నారు. దుమ్ములో ఉండే కణాలు భూమిపై పడే సూర్యకాంతిని ప్రతిబింబిస్తాయి. అంతే కాకుండా భూమిని వెచ్చగా ఉంచే మబ్బులను ఏర్పడేలా చేస్తాయి.

ఇక సముద్రాల్లోకి వెళ్లే దుమ్ము కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తుంది. మంచుగడ్డలోకి చేరిన దుమ్ము భూమిపై ఉండే మరింత వేడిని పీల్చుకుంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత దుమ్ముకు భూమిని చల్లబరిచే శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
గ్లోబర్ వార్మింగ్ విషయానికొస్తే.. ఇప్పటికే శాస్త్రవేత్తలు భూమిపై వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొని ఇదొక ఎమర్జెన్సీ అని తేల్చిచెప్పారు. ఇప్పటికీ ఎన్నో పరికారాలు వాతావరణంలోని మార్పులను సూచిస్తాయి. కానీ అవన్నీ దుమ్ము వల్లే ఏర్పడే మార్పులను చూపించలేకపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.


పరిశ్రమల వల్ల, వ్యవసాయం వల్ల, వివిధ రకాల అభివ‌ృద్ధి కార్యక్రమాల వల్ల భూమిపై దుమ్ము శాతం పెరిగినా కూడా అది మంచికే అని శాస్త్రవేత్తలు హామి ఇస్తున్నారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన మరిన్ని పరిశోధనలు జరుగుతాయని వారు చెప్తున్నారు. సమయాన్ని బట్టి దుమ్ములోని కణాలు ఎలా మారుతాయి అనేది ఈ పరిశోధనల ద్వారా తేల్చనున్నారు శాస్త్రవేత్తలు.

Follow this link for more updates:- Bigtv

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×