Big Stories

Hong Kong Fashion Show: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దుస్తుల్లో మోడల్స్ మెరుపులు

Hong Kong Fashion Show:టెక్నాలజీ అన్ని రంగాల్లోకి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ క్రమంగా విస్తరించడం ఒక రకంగా సంతోషం, మరో రకంగా బాధ కూడా కలిగిస్తోంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్తదనం వస్తుంది. అదే సమయంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. చాలా సంస్థలు ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చుల భారం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగం పెరుగుతోంది. ఇక ఇక్కడ విషయం ఏంటంటే…. ఏఐతో రూపొందించిన రకరకాల డిజైన్ దుస్తులతో ఫ్యాషన్ షో నిర్వహించారు. సాధారణ దుస్తులకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఈ దుస్తులు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. వీటిని ధరించిన మోడల్స్ ఎంతగానో మురిసిపోయారు. ఈ కొత్తరకం దుస్తులను హాంగ్ కాంగ్ లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ వీక్ షోలో ప్రదర్శించారు. వీటిని ధరించిన మోడల్స్ ర్యాంప్ పై ఒయలు పోయారు. హాంకాంగ్ కు చెందిన ఏఐడి ల్యాబ్స్ ఈ కొత్తరకం అవుట్ ఫిట్స్ ని తయారు చేసింది. ఏఐతో డిజైన్ చేసిన దుస్తులను ఈ సంస్థ మొదటిసారి హాంకాంగ్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించి ఆకట్టుకుంది.
ఈ దుస్తులను ఏఐ సాఫ్ట్ వేర్ ఏఐడీఏతో డిజైన్ చేశారు. డిజైనర్లకు తోడ్పాను అందిచండం కోసమే ఈ సాఫ్ట్ వేర్ ని తీసుకొచ్చినట్లు ఏఐడి ల్యాబ్స్ తెలిపింది. మొత్తం 80 రకాల దుస్తులను 14 మంది డిజైనర్లు రూపొందించారు. వీటిని ధరించి హొయలు పోయిన మోడల్స్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి ఏఐ టెక్నాలజీతో దుస్తులను ఎలా తయారు చేస్తారు?
తమకు ఎలాంటి డిజైన్ కావాలో, వాటికి ఏయే రంగులు వాడాలో ముందుగానే డిజైనర్లు డిసైడ్ అవ్వాలి. వాటిని ఏఐడిఏ సాఫ్ట్ వేర్ లోకి అప్ లోడ్ చేయాలి. క్షణల్లో అంటే కేవలం 10 సెకన్లలోనే కావల్సిన కలెక్షన్లు కళ్లముందు మెరుస్తాయి. మరో విశేషం ఏంటంటే… కేవలం 10 సెకండ్లలో డజనుకుపైగా డిజైన్లు తయారు చేయగలిగే సామర్థ్యం ఈ సాఫ్ట్ వేర్ కు ఉంది. అంటే ఒక డిజైన్ తయారు కావడానికి ఒక సెకను కూడా పట్టదన్నమాట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News