Big Stories

Air India : రివ్వున ఎగురుదాం..

Air India

Air India : దేశంలో విమానయాన రంగం ఊపుమీదుంది. ఈ ఏడాది ఎయిరిండియా 470 విమానాలకు ఆర్డర్ పెట్టింది.
దేశ చరిత్రలో ఇంత భారీగా ప్లేన్లు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలు వీటిని అందజేస్తాయి.

- Advertisement -

ఈ దశాబ్దం చివరికి దేశవ్యాప్తంగా ఎగిరే విమానాల సంఖ్య 1500-1700కి చేరుతుందని అంచనా. రానున్న ఏడేళ్లలో విమానయానం పురోగతి 10-12 శాతం మేర ఉంటుంది. ఇంత శరవేగంగా అభివృద్ధి ఎక్కడా లేదు.

- Advertisement -

2016లో విమానాల సంఖ్య 479 ఉండగా.. ప్రస్తుతం 647 విమానాలు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి 1500కి చేరే అవకాశాలు ఉన్నాయి. ఏవియేషన్ రంగానికి ప్రభుత్వ సహకారం కూడా తోడైంది. గత 12 నెలల కాలంలోనే నాలుగు విమానాశ్రయాలు, నాలుగు టెర్మినళ్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి.

డొమెస్టిక్ పాసింజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2012-13లో 98 మిలియన్ల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించగా.. 2019-20 నాటికి ఆ సంఖ్య 202 మిలియన్లకు చేరింది. పరిమాణం రీత్యా చూస్తే ఇప్పటికే మూడో పెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ మనది. 2042 నాటికి ఈ మార్కెట్ ఐదు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. 2030 నాటికి డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య 500 మిలియన్లకు చేరుతుందని అంచనా.

ఇక విదేశీ విమానయాన సంస్థలు కూడా భారత్ ఏవీయేషన్ మార్కెట్‌పై కన్నేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), సహా పలు దేశాలు కొత్తగా ఫ్లయింగ్ రైట్స్ కోసం అర్థిస్తున్నాయి. యూఏఈ, ఖతర్, సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, తుర్కియే తదితర దేశాలు సీట్ల సంఖ్యను పెంచాలని, ట్రావెల్ స్లాట్లను పెంచాలని కోరుతున్నాయి. భారతీయ విమానయాన సంస్థలకు లబ్ధి చేకూరేంత వరకు ఆయా దేశాల అభ్యర్థనలను ప్రభుత్వం కొంత కాలం పెండింగ్‌లో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News