BigTV English

CM Hemant Soren : నెక్ట్స్ టార్గెట్ కేసీఆరేనా?.. ఝార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు..

CM Hemant Soren : నెక్ట్స్ టార్గెట్ కేసీఆరేనా?.. ఝార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు..

CM Hemant Soren : గవర్నర్ రమేశ్ బైస్ చెప్పినట్టే ఝార్ఖండ్ లో అణుబాంబు పేలింది. సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. మైనింగ్ లీజులో అక్రమాలు జరిగాయని.. మనీలాండరింగ్ కేసులో నవంబర్ 3న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సోరెన్ రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు అరెస్టు కాగా.. సీఎం హేమంత్ ను సైతం అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేయగా.. కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఝార్ఖండ్ గవర్నర్ కు పంపించింది. ఇప్పుడు ఏకంగా సీఎం సోరెన్ కు ఈడీ సమన్లు ఇవ్వడం చూస్తుంటే.. ఇక ఝార్ఖండ్ లో జేఎమ్ఎమ్ సర్కారు కుప్పకూలినట్టే..అంటున్నారు.


ఝార్ఖండ్ లో అణుబాంబు పేలితే.. తెలంగాణలో విస్పోటం రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామంతో సీఎం కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని కమలనాథులు పంచ్ లు పేలుస్తున్నారు. నెక్ట్స్ టార్గెట్ కేసీఆరే అంటున్నారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే ఆయనపై సీబీఐ, ఈడీ రైడ్స్ జరుగుతాయంటూ బీజేపీ పదే పదే చెబుతోంది. ముఖ్యమంత్రిని.. నన్నేం చేస్తారు.. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. అంటూ గులాబీ బాస్ సైతం పలుమార్లు సవాల్ చేశారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ కేసులో కమిత ప్రమేయంపై ఆరోపణలు రావడం.. తెలంగాణలో సీబీఐ సోదాలు, అరెస్టు.. తదితర పరిణామాలతో ముందస్తు సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో లేటెస్ట్ గా ఝార్ఖండ్ సీఎంకు ఈడీ సమన్లు ఇవ్వగా.. ఆ తర్వాత తెలంగాణ సీఎంపైనే ఫోకస్ ఉంటుందంటూ కమలనాథులు వార్నింగులు ఇస్తున్నారు. కొన్ని నెలల క్రితం సీఎం కేసీఆర్ ఝార్ఖండ్ వెళ్లి మరీ హేమంత్ సోరెన్ తో చర్చలు జరపడం ఇందుకేనా అనే డౌట్ కూడా ఉంది.

గతంలో మాజీ ముఖ్యమంత్రులపై ఈడీ, సీబీఐలు చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయిగానీ.. నేరుగా పదవిలో ఉన్న సీఎంకు ఈడీ నోటీసులు ఇవ్వడం బహుషా ఇదే మొదటిసారి కావొచ్చని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను పడగొట్టడంలో భాగంగానే.. ఆయా రాష్ట్రాల మీదకు జాతీయ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారనే విమర్శ ఉంది. కుదిరితే పార్టీని చీల్చడం.. లేదంటే ఈడీ, సీబీఐలతో భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదే బీజేపీ స్ట్రాటజీ అని మండిపడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పేంటనేది కమలం ప్రశ్న.


Related News

Kothagudem Congress: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?

Jani Master: బిగ్ బాస్‌లోకి జానీ మాస్టర్ అసిస్టెంట్… ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే

AP Politics: కొత్త కార్యచరణతో దూకుడు పెంచాలని చూస్తున్న జగన్.. ఎందుకంటే!

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Big Stories

×