Tata:దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్… ఇప్పటికే ప్రజాదరణ పొందిన నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్లలో రెడ్ డార్క్ ఎడిషన్‌లను విడుదల చేసింది. కేవలం కాస్మెటిక్ అప్‌డేట్స్ మాత్రమే కాకుండా… సేఫ్టీ, టెక్నాలజీ పరంగా కూడా వీటిని అప్‌గ్రేడ్ చేసింది… టాటా మోటార్స్. టాటా నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణి రూ.12.35 లక్షల నుంచి రూ.14.35 లక్షల వరకు ఉంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్… నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ప్రత్యేకతలు.
హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ రెండు వేరియంట్లలో మాత్రమే విడుదలైంది. ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, ఎక్స్‌జెడ్ ప్లస్ ఆప్షనల్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది… టాటా. మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.77 లక్షలు కాగా, ఆటోమాటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.24.07 లక్షలు. హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ రెండు వేరియంట్లనూ… ఏడీఏఎస్ టెక్నాలజీతో తీసుకొచ్చారు.
ఇక సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ధరల శ్రేణి రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉంది. వీటికి కూడా ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు వెంటిలేటెడ్ సీట్లు… డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ ఇచ్చారు. రెడ్ డార్క్ ఎడిషన్‌లో విడుదలైన మూడు కార్లలోనూ ఇంజిన్ పరంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. కాబట్టి… పర్ఫామెన్స్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. 2023 ఆటో ఎక్స్‌పోలో రెడ్ డార్క్ ఎడిషన్‌లో సఫారీ, హారియర్‌ను మాత్రమే ప్రదర్శించిన టాటా… నెక్సాన్‌ని కూడా రెడ్ డార్క్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఈ మూడు కార్లపై మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీ ఇస్తోంది… టాటా.
Wipro and Infosys:ఆ కంపెనీలకు ఏమైంది? ఫ్రెషర్లలో ఆందోళన!
New Electric Scooty:మార్కెట్లోకి మరో 2 కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు