Big Stories

BJP : బండి దూకుడుకు ఈటల బ్రేకులు!.. ఆధిపత్య పోరు షురూ?

BJP : తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యమని బీజేపీ ఢిల్లీ పెద్దలు పదపదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. పార్టీలోకి చేరికలు ప్రోత్సహించాలని రాష్ట్ర నేతలకు టాస్క్ అప్పగించారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓటమి తర్వాత పేరున్న నేతలెవరూ కాషాయ కండువా కప్పుకోలేదు. పార్టీలో నేతలను చేర్చుకునే బాధ్యతను ఈటల రాజేందర్ కు పార్టీ అధిష్టానం అప్పగించింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇక 6 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈటల పలువురు నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతల మధ్య సరైన సమన్వయం లేదనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మధ్య గ్యాప్ వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ తాజాగా చేసిన కామెంట్స్ ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

- Advertisement -

తెలంగాణ బీజేపీ నేతలు ఎవరి మార్క్‌ వాళ్లు చూపించాలనుకుంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించే విషయంలో బీజేపీ చేరికల కమిటీ సంప్రదింపులు మొదలుపెట్టింది. పొంగులేటి కలిసి ఈటల పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈటల వెంట రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు.

ఈ వ్యవహారంపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. పొంగులేటి దగ్గరకు ఈటల వెళ్లారనే సమాచారం తనకు తెలియదన్నారు బండి. తన దగ్గర ఫోన్‌ లేదని.. అందుకే సమాచారం అందలేదని తెలిపారు. తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారని స్పష్టం చేశారు. తనకు తెలిసినవారితో తాను మాట్లాడతానని చెప్పారు. ఈటలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారని.. ఇందులో తప్పేంలేదని వివరణ ఇచ్చుకున్నారు. పొంగులేటి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో రాక్షస రాజ్యంపై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకునిపోతామన్నారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆ ఇద్దరు నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకున్నారు. ఈ చర్చల్లో బండి సంజయ్ ఎందుకు పాల్గొనలేదనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. మరి ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నలు ఎదురువుతున్నాయి. బండికి ఈటలకు గ్యాప్ వచ్చిందా..? అధికారం దక్కకముందే తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైందా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News