Eclipses : సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తున్నాయంటే గర్బిణులు భయపడుతుంటారు. తమ కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని కలవర పడుతుంటారు. కొన్ని పనులు చేయడం వల్ల గర్భంలో ఉండే పిండానికి చెడు జరుగుతుంది. తీసుకునే ఆహారం నుంచి పడుకునే పడక గది వరకు చాలా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సూర్య గ్రహణం నాడు గర్భిణులు చేయకూడని పనులు
ముఖ్యంగా గర్భిణిలు గ్రహణ గడియలు ఆరంభానికి ముందే తగిన సమయంలో ఆహారం తినేయాలి ..అవసరమైతే ఈవిషయంలో వైద్యుల సూచనలు తీసుకోవాలి. సులభంగా తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలు మాత్రమే తినడం మంచిది. సాధ్యమైనంత వరకు గ్రహణ సమయంలో ఆహారాన్ని భుజించకూడకుండా జాగ్రత్త పడాలి. తప్పని సరైతే ఔషధాలు తీసుకోవచ్చు.సూర్యకిరణాలు సోకని ప్రదేశంలో ఉండేటట్టు జాగ్రత తీసుకోవాలి. వీలైతే ఒక గదిలో కదలకుండా పడుకుని ఉంటే మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
సూర్యగ్రహణం నాడు వెలువడే కిరణాల్లో కొన్ని విషతుల్యమైనవి అంటే హానికరమైన కిరణాలు ప్రసరించే అవకాశం ఉంటుంది. సూర్య గ్రహణాల వేళ అల్ట్రావైలెట్ అంటే యువీ రేస్ వెలువడుతుంటాయని శాస్త్రజ్ఞులు గతంలో చెప్పారు. విషతుల్యమైన కిరణాలు గర్భంలోని పిండానికి హానీ కలిగే ప్రమాదం ఉంది.
అలాంటి అతినీల లోహిత కిరణాలు శరీరాన్ని తాకితే ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతుంటారు. ఈ పరిస్థితులను అనుభవం పూర్వకంగా తెలుసుకుని గ్రహణస మయంలో ఇంటి పనులు, వంట పనులు చేయద్దని మన పెద్దలు ముందు జాగ్రత్తగా వందల ఏళ్ల క్రితమే చెప్పారు. ఇవన్నీ వందల ఏళ్ల క్రితం గుర్తించిన మన పెద్దలు, పూర్వికులు గ్రహణాలు చూడకూడదని చెబుతూ ఉండే వారు. కొంతమంది ఇవన్నీ ఇప్పటికి మూఢనమ్మకాలని కొట్టిపడేసే వారు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడే వారు కూడా గ్రహణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో మహిళలు, వృధ్యాప్యంతో ఉన్నా వారు, గర్భిణిలు ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ సూర్యరశ్మి ప్రసరించిన గదుల్లో పడుకుని ఉండటం శ్రేయస్కరం.
గ్రహణం తర్వాత చేయాల్సి పనులు
గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఆరోగ్య పరిస్థితులను బట్టి చల్లటి నీళ్లు లేదా వేడినీళ్లతో స్నానాలు చేయాలి. ఇంటిని శుద్ధి చేసుకోవాలి. గర్భిణిలు కత్తితో కూరగాయలు కోయకూడదని మన పెద్దలు చెప్పారు. సూది, దారం లాంటివి వారు వాడటం, బట్టలు కుట్టడం లాంటి పనులు చేయకూడదని సెలవిచ్చారు.