BigTV English

AI for Alzheimers Disease : ఏఐ సాయంతో అల్జీమర్స్ గుర్తింపుకు ప్రయత్నం..

AI for Alzheimers Disease : ఏఐ సాయంతో అల్జీమర్స్ గుర్తింపుకు ప్రయత్నం..
AI for Alzheimers Disease

AI for Alzheimers Disease : అల్జీమర్స్ వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా మానవాళి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే విపరీతంగా మనవాళిలో విస్తరిస్తున్న ఈ వ్యాప్తికి కారణమేంటి, చికిత్స ఏంటి లాంటి విషయాలు తెలుసుకోవడం ఇప్పటీకీ అసాధ్యంగానే ఉంది కాబట్టి. శాస్త్రవేత్తలు ఏ మాత్రం విరామం లేకుండా అల్జీమర్స్ గురించి కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నా కూడా వారు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. అందుకే దీనికోసం ఏఐ సాయం తీసుకోవాలని హాంగ్‌కాంగ్ శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.


ఏఐ అనేది తనకు ఏం చెప్పినా గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని బట్టి పరిశోధనలు కూడా చేస్తుంది. అందుకే ఏఐలో జెనటిక్ ఇన్ఫర్మేషన్‌ను ఫీడ్ చేసి దాన్ని బట్టి అల్జీమర్స్‌పై పరిశోధనలు చేపట్టాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఏ లక్షణాలు కనిపించకముందే ఏఐ ద్వారా అల్జీమర్స్ వచ్చే అవకాశాలను కనిపెట్టాలి అన్నదే శాస్త్రవేత్తల ముఖ్య టార్గెట్. అల్జీమర్స్ వచ్చే రిస్కులను ఏఐ మోడల్‌లోకి మార్చాలని వారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా యూరోప్, చైనాలో ఈ కేసులపై స్టడీ చేయనున్నారు.

అల్జీమర్స్ అనేది అందరిపై ఒకేలా ప్రభావం చూపించదని, అందులోని మార్పులను ముందుగా స్టడీ చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఈ సమాచారాన్నే ఏఐ మోడల్‌గా మార్చనున్నారు. అల్జీమర్స్ వ్యాధి గురించి ఏఐ స్టడీ చేయడం మాత్రమే కాకుండా.. తాను స్టడీ చేసిన విషయాలను ఇతర వైద్యులతో పంచుకోనుంది. దీనికోసం ఏఐతో పాటు ఒక టీమ్ ఏర్పాటయ్యింది. ఈ టీమ్‌లో దాదాపు 100 మంది ఉన్నట్టు సమాచారం. వీరు పూర్తిగా అల్జీమర్స్ పేషెంట్ల కేర్, చికిత్స గురించి మాత్రమే పనిచేస్తారని తెలుస్తోంది.


ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధి గురించి కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అందరూ కష్టపడుతున్నారు. తాజాగా టెక్ మార్కెట్లోకి వచ్చిన ఏఐ సాయంతో అల్జీమర్స్ గురించి కనుక్కోవాలని పలువురు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అందులో హాంగ్‌కాంగ్ కూడా ఒకటి. కాకపోతే ఈ దేశ శాస్త్రవేత్తలు ఏఐతో పాటు పలువురు వైద్యులు కూడా ఇందులో పాల్గొనేలాగా సన్నాహాలు చేయడం ద్వారా దీనికి ఒక పరిష్కారం దొరుకుంతుందేమో అని పేషెంట్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో.. ఏ ఒక్క పరిశోధన సక్సెస్ అయినా కూడా అల్జీమర్స్‌ను అదుపు చేసే అవకాశం ఉంటుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×