E-Paper
Advertisement

The Cause of Mental Diseases: మెదడులో రక్తం.. మానసిక వ్యాధులకు కారణం..

The Cause of Mental Diseases: మెదడులో రక్తం.. మానసిక వ్యాధులకు కారణం..
Advertisement

The Cause of Mental Diseases : ఏ ఆరోగ్య సమస్యను కనిపెట్టడానికి అయినా ఒక కొత్త రకం టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఈ పద్ధతులన్నీ మరింత మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలను మరింత వేగంగా కనిపెట్టాలని అనుకుంటున్నారు. అందుకోసమే మనుషులను నిరంతరం కనిపెడుతూ ఉండే టెక్నాలజీలను తయరు చేశారు. తాజాగా మనిషి రక్తాన్ని స్టడీ చేయడం ద్వారా కూడా వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటారో తెలుసుకునే అవకాశం ఉందని బయటపెట్టారు.

టెక్నాలజీ ఎంత మెరుగుపడినా కూడా పలు మానసిక వ్యాధులను ముందస్తుగా కనిపెట్టడం, వాటికి చికిత్సలను అందించడం ఇప్పటికీ కష్టంగానే ఉంది. అలాంటి వ్యాధుల్లో ఒకటి అల్జీమర్స్. అల్జీమర్స్ అనేది న్యూరలాజికల్ వ్యాధి కాబట్టి.. దీని వల్ల మెదడులో న్యూరాన్స్ అనేవి దెబ్బతినడానికి ఎక్కువ సమయం పట్టదు. న్యూరాన్స్ అనేవి దెబ్బతిన్న తర్వాత మనిషి ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పుడు అల్జీమర్స్ గురించి బయటపడుతుంది. అలా కాకుండా దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నారు.

Advertisement

మెదడులో మైక్రోగ్లియా అనే భాగం.. తన పని తను సరిగా చేయలేనప్పుడు ఇలాంటి వ్యాధులకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ముందుగా మైక్రోగ్లియా అనేది ఎలాంటి పరిస్థితుల్లో మార్పులకు గురవుతుందని వారు గుర్తించాలని అనుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో న్యూరలాజికల్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే మైక్రోగ్లియా అనేది వ్యాధులకు కారణమవ్వడానికి ముఖ్య కారణం మనిషి రక్తమే అని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తాజాగా తేలింది. మెదడులో ముందుగా రక్తం లీక్ అవ్వడం వల్ల మైక్రోగ్లియా దెబ్బతింటుందని వారు గుర్తించారు.

ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో రక్తనాళాలను స్టడీ చేస్తూ ఉండడం వల్ల మనిషికి వచ్చే ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించవచ్చని తేలింది. ఇప్పుడు కూడా మానసిక వ్యాధులను కనుక్కోవడానికి మెదడులో రక్తం సరిగా ఫ్లో అవుతుందా లేదా అని తెలుసుకుంటే చాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రక్తం అనేది మనిషి శరీరం గురించి పూర్తిగా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుందని, దీన వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను టెక్నాలజీ ద్వారా కనుక్కునే ప్రయత్నం చేయాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×