BigTV English

Average Student Nani: మీడియాతో చిట్ చాట్ చేసిన.. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ హీరో హీరోయిన్లు

Average Student Nani: మీడియాతో చిట్ చాట్ చేసిన.. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ హీరో హీరోయిన్లు

Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా రేపు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన కథా నాయక, నాయికలు మీడియాతో ముచ్చటించారు.


హీరో పవన్ కుమార్ మాట్లాడుతూ.. నేను ఇంతముందుకు ఒక సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమా పేరు మెరిసే మెరిసే. ఆ తరువాత మరో సినిమా కోసం కథ రాసుకున్నాను. ఒక స్టూడెంట్ లైఫ్ ను బేస్డ్ గా చేసుకుని ఆ కథ రాశాను. ఆ కథనే ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. ఈ మూవీలో హీరోయిన్స్ విషయంలో ముందే ఫిక్స్ అయ్యాను. అయితే, హీరో మాత్రమం డీగ్లామర్ గా ఉండాలనుకున్నాను. ఈ క్రమంలో చివరకు నేనే హీరోగా చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖులు నటించారు. ఝాన్సీ గారెని ఒప్పించేందుకు చాలా సమయం పట్టింది. అయితే, షార్ట్ ఫిల్మ్స్ చేసే సమయంలో హీరో, డైరెక్షన్.. ఇలా అన్ని క్రాఫ్ట్ లను హ్యాండిల్ చేయచ్చు. కానీ, ఫీచర్ సినిమాలు చేసే సమయంలో మాత్రం ఇలా అన్ని డిపార్మెంట్లను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఇది థియేటర్లలో విజిల్స్ వేస్తూ.. అల్లరి చేస్తూ చూడాల్సిన సినిమా’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు.

అనంతరం హీరోయిన్ బాసిన్ మాట్లాడుతూ.. ”వరేజ్ స్టూడెంట్ నాని’ సినిమాలో నటించడం ఫుల్ హ్యాపీగా ఉంది. నాకు ఇలాంటి ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్, హీరో పవన్ కు థ్యాంక్స్. పవన్ స్పెషాలిటీ ఏమిటంటే. అన్ని క్రాఫ్ట్ లను చక్కగా హ్యాండిల్ చేశాడు. పవన్ నుంచి ఎంతో నేర్చుకున్నా’ అని ఆమె వెల్లడించింది.


Also Read: సీరియల్ హీరోయిన్ టూ స్టార్ హీరోయిన్..

మరో హీరోయిన్ స్నేహా మాల్వియా మాట్లాడారు. ‘ఈ సినిమాలో సారా పాత్ర గురించి విన్న వెంటనే నేను ఓకే చెప్పేశాను. ఇలాంటి లైఫ్ ను ఎక్స్ పీరియన్స్ చేయాలని అనుకుంటారు కానీ, నా రియల్ లైఫ్ కూడా సారాలానే ఉంటది. అందరి దృష్టి తనపైనే ఉండాలనే క్యారెక్టర్ సారాది. ఆమె ఎంతో సున్నితమైన మనస్తత్వంతో ఉంటుంది. అంతేకాదు.. చాలా ఎమోషనల్ పర్సన్. ఇలాంటి పాత్రనే చేయాలనుకున్నాను చేశాను. ఇదే నాకు ఫస్ట్ మూవీ. సెట్స్ మీద సాహిబా చాలా ప్రొఫేషనల్ గా మెయింటెన్ చేస్తుంది. అయితే, నేను కాస్త అల్లరి చేస్తుంటా. నాకు డ్యాన్స్ అంటే ఫుల్లు ఇష్టం. ఈ సినిమాలోని పాటల్లో చాలా మూమెంట్స్ వేశాము. హీరో, డైరెక్టర్ పవన్ మల్టీ టాలెంటెడ్’ అని చెప్పింది.

కాగా, ఈ సినిమాకు హీరో పవన్ కుమారే డైరెక్టర్ గా పని చేశారు. శ్రీనీలకంఠ మహదేవ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పి బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లోకి రానున్నది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×