BigTV English
Advertisement

Cardamom Benefits: పరగడుపున యాలకులు తింటే శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..

Cardamom Benefits: పరగడుపున యాలకులు తింటే శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..

Cardamom Benefits: యాలకులతో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు చాలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఆహారం రుచిగా మారుతుంది. అంతేకాదు యాలకులను ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. యాలకులు రోజుకు రెండు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


బరువు తగ్గడం :

యాలకులు ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయని NCBI నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఎక్కువసేపు నిండుగా ఉంచేలా చేస్తుంది. ఆకలిని తగ్గించి, జీవక్రియను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గే క్రమంలో కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది.


జీర్ణవ్యవస్థ ఆరోగ్యం :

యాలకులు జీర్ణ వ్యవస్థ ప్రక్రియను మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది. ఈ తరుణంలో జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రోత్సహించి ఆహారం సాఫీగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. తరచూ ఉదయం పరగడుపున రెండు యాలకులను తీసుకుంటే గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి చాలా సమస్యలను తొలగించవచ్చు. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కడుపు వాపును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.

నోటి దుర్వాసన :

యాలకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసనను తగ్గించేందుకు సహాయపడతాయి. ఖాళీ కడుపుతో యాలకులను తినడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

రోగనిరోధక శక్తి :

శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా తరచూ యాలకులను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

రక్తంలో చక్కెర నియంత్రణ :

యాలకులు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించేలా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. తరచూ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మ ఆరోగ్యం :

యాలకులు కేవలం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తి చేసి చర్మాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. మరోవైపు చర్మంపై ఏర్పడే ముడతలను కూడా తొలగిస్తుంది. చర్మంపై మంటలు ఏర్పడితే వాటిని నివారించడానికి కూడా యాలకులు ప్రధాన పోత్ర పోషిస్తాయి.

Related News

Fat Rich Fruits : ఫ్యాట్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Winter Skincare: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !

Diabetes And Stroke: రక్తంలో చక్కెర పెరుగుదల.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

Banana: రోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా ?

Big Stories

×