BigTV English

Banana Fibre: ప్లాస్టిక్స్‌కు కొత్త ప్రత్యామ్నాయం బనానా ఫైబర్..

Banana Fibre: ప్లాస్టిక్స్‌కు కొత్త ప్రత్యామ్నాయం బనానా ఫైబర్..

Banana Fibre: ప్లాస్టిక్స్ అనేవి మనుషుల ప్రాణాలకు మాత్రమే కాదు ప్రకృతికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తాయి. అందుకే ప్లాస్టిక్స్‌కు ప్రత్యామ్నాయం వెతకడం కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు విషయాల్లో ప్లాస్టిక్స్ వినియోగం అనేది చాలావరకు తగ్గిపోయినా.. ప్రకృతిపై ప్రభావం పడకుండా ఉండడానికి ఇది సరిపోదని వారు చెప్తున్నారు. అందుకే దానికి మరొక కొత్త ప్రత్నామ్నాయాన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు.


వ్యవసాయ రంగంలో కూడా చాలా వనరులు వేస్ట్‌గా పరిగణించబడతాయి. ఈ అగ్రికల్చర్ వేస్ట్‌ను కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. ముఖ్యంగా బనానా ఫైబర్ అనేది చాలావరకు తయారీల్లో ఉపయోగపడుతుందని తేల్చారు. ఈ ఆలోచన ముందుగా పాసిఫిక్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చింది. వారికి తోడుగా పాపువా న్యూ జీన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తోడయ్యారు. ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపు 40,000 బనానా చెట్లు ఉండగా.. వాటినే ఈ ప్రయోగానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.

బనానా ఫైబర్ అనేది కేవలం ప్లాస్టిక్స్‌ను మాత్రమే కాదు.. కెమికల్ ఎరువులకు కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే ఈ రెండు యూనివర్సిటీల విద్యార్థులు కలిసి వాతావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఈ బనానా ఫైబర్‌పై పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు వెజిటేబుల్ ఆయిల్‌ను బయోడీజిల్‌గా మార్చాలని కూడా వారు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రయోగాలు సక్సెస్ అయితే చాలామంది దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.


ఈరోజుల్లో ప్లాస్టిక్స్‌, వంటనూనె.. ఇలా ఎన్నో వస్తువులను తరచుగా ఉపయోగించడం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోంది. అందుకే పర్యావరణానికి ఏ హాని కలగకుండా కొన్ని హానికరమైన వస్తువులకు ప్రత్యామ్నాయాలను కనుక్కోవడమే వారి టార్గెట్ అని యూనివర్సిటీ విద్యార్థులు బయటపెట్టారు. వీటితో పాటు మరెన్నో పరిశోధనలు చేపట్టడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా బనానా ఫైబర్‌తో కెమికల్ ఎరువులకు, ప్లాస్టిక్స్‌కు ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్న తర్వాత మిగతా పరిశోధనలు మొదలుపెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×