Big Stories

Blood Cancer : బ్లడ్‌ క్యాన్సర్‌ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

Blood Cancer : ఏ క్యాన్సర్‌ అయినా ముందుగా గుర్తిస్తే చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. క్యాన్సర్ అంటే మన శరీరంలో వచ్చే అసాధారణమైన కణాల పెరుగుదల. క్యాన్సర్లులో ముఖ్యంగా కార్సినోమా, లుకీమియా, సార్కోమా, లింఫోమా అనే రకాలున్నాయి.10 లక్షల మందిలో 35 మందికి బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్త క్యాన్సర్లు ఉన్నవారికి ఆకలి కాదు, ఎప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటారు. తరచూ జ్వరం వస్తుంది. ఏదోక ఇన్‌ఫెక్షన్ బారిన పడుతుంటారు. చిన్న గాయం అయినా అందులోంచి ఎక్కువగా రక్తం వస్తుంటుంది. రాత్రి సమయంలో ఎక్కువగా చమట పడుతుంది. బరువు తగ్గిపోతారు. కీళ్ల మధ్యలో భరించలేనంతగా నొప్పులు వస్తాయి. అంతేకాకుండా ముక్కు, చిగుళ్ల ద్వారా రక్తం వస్తుంది. పీరియడ్‌ ఫ్లో కూడా అధికంగా ఉంటుంది. స్మోకింగ్‌ అలవాటు ఉన్నవాళ్లకి బ్లడ్ క్యాన్సర్‌ వస్తుంది. కెమికల్‌ కంపెనీల్లో పనిచేసేవారికి కూడా తొందరగా బ్లడ్‌ క్యాన్సర్‌ వస్తుంది. అయితే బ్లడ్ కాన్సర్‌ని కీమోథెరపీ, ఇతర ట్రీట్‌మెంట్స్ ద్వారా చాలా వరకు నయం చేయవచ్చు. కీమోథెరపీ వీలుకాకపోతే స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం బరువు పెరిగితే కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయని అందుకే తక్కువగా ఆహారం తినాలని అంటున్నారు. సిగ‌రెట్‌, మ‌ద్యం మానేస్తే చాలా వరకు క్యాన్సర్లను తగ్గింవచ్చని హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్‌ దూరం పెట్టాలి, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, వీలైనంత వరకు చక్కెర తినకుండే ఉంటే మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కూల్‌డ్రింక్స్‌, మిఠాయిలు ఎక్కువగా తీసుకోకూడదు. గ్రీన్ టీలో ఉన్న పోలిఫినాల్‌ క్యాన్సర్‌ సెల్‌ పెరుగుదలను అదుపులో ఉంచుతుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News