Dates : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. పొట్టను తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సరైన ఫలితం ఉండకుండాపోతోంది. అయితే సరైన పోషకాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేసుకుంటూ ఈ డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా మీ జీర్ణక్రియ కూడా బాగా ఉంటుంది. మొదట రెండు లేదా మూడు ఖర్జూరాలను తీసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి పక్కనపెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి అందులో గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయిన తర్వాత ఖర్జూరం, అల్లం ముక్కలు వేసి 5 నుంచి 8 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఈ నీటిని వడకట్టి దానిలో స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయాన్నే తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. కాకపోతే మీరు ఆహారాన్ని మితంగా తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. అప్పుడే ఈ ఖజ్జురాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ప్రతి రోజు 4 ఖర్జూరం తింటే మంచిది. మన శరీరంలో ఐరన్, రక్త హీనత లోపాలను ఇది తగ్గిస్తుంది. నీరసం, అలసట కూడా పోతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్‌లో వాడే అల్లాన్ని ఆయుర్వేదం, హోమియోపతిలో ఎక్కువగా వాడుతారు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పొటాషియం, రాగి, మాంగనీస్, మెగ్నీషియంలాంటి సహజ ఖనిజాలు ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.