BigTV English

Eye Glasses : బ్లూ లైట్‌ గ్లాసెస్‌ నిజంగా కళ్లను కాపాడతాయా..? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..?

Eye Glasses : బ్లూ లైట్‌ గ్లాసెస్‌ నిజంగా కళ్లను కాపాడతాయా..? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..?

Eye Glasses : మన మెదడు 80 శాతం సమాచారాన్ని కళ్ల ద్వారా అందుకుంటుంది. కాబట్టి కళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చిన్న వయసులోనే కంటి సమస్యలు వస్తున్నాయి. మొబైల్స్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.


అయితే వీటి కాంతి నుంచి కళ్లను రక్షించుకునేందుకు అద్దాలు ధరిస్తుంటారు. చాలా మంది నీలి కాంతి కళ్లకు చేరకుండా నిరోధించే అద్దాలు ధరిస్తున్నారు. వాటి వలన ఒత్తిడి తగ్గుతుందని, నిద్ర మెరుగుపడుతుందని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మకం. అసలు నిజంగా ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా..? దీనిపై జరిగిన పరిశోధనలు ఏం అంటున్నాయో చూద్దాం.

యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, సిటీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, మోనాష్ యూనివర్సిటీ అద్దాలకు సంబంధించిన అధ్యయనాలను సర్వే చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బ్లూ లైట్‌ను ఫిల్టర్ చేయవచ్చా అని ప్రయత్నించారు. ఫలితం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. నీలి రంగు కాంతికి వ్యతిరేకంగా అద్దాలు రక్షణ కల్పించలేవని పరిశోధనలో తేలింది.


ఈ బృందం ఆరు దేశాలకు చెందిన 619 మందిని పరిశీలించింది. వారికి 17 రకాల పరీక్షలు నిర్వహించింది. ప్రామాణిక లెన్స్‌తో పోలిస్తే.. బ్లూ లైట్ ఫిల్టరింగ్ లెన్స్‌ల ఉపయోగం కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనాన్ని అందించలేదని కనుగొంది. ఈ పరిశోధనలో కంటి ఒత్తిడిని రెండు గంటల నుంచి ఐదు రోజుల వ్యవధిలో పరిశీలించారు.

నీలి రంగు కాంతికి ప్రధాన మూలం సూర్యుడు. నీలిరంగు కాంతి మన వాతావరణంలో ప్రతి చోట ఉంటుంది. అంతేకాకుండా.. ఇంటిలోని అన్ని లైటింగ్ పరికరాలు నీలిరంగు కాంతికి మూలాలు. LEDలు, డిజిటల్ పరికరాల స్క్రీన్‌లతో సహా విభిన్నమైన కాంతిని ప్రసరింపజేస్తాయి. వీటి నుంచి వచ్చే కాంతి సూర్యుడి కాంతి కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూర్యడు కన్నా వీటి నుంచే మనకు ఎక్కువ హాని ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ సమయం మనతో ఉంటాయి.

అద్దాలు ధరించడం వల్ల తలనొప్పి, మానసక స్థితి సరిగా ఉండటం లేదని అధ్యయనంలో ధృవీకరించారు. ప్రామాణిక లెన్స్‌లతో గ్లాసులను ఉపయోగించే వ్యక్తులు ఇలాంటి ప్రభావాలను నివేదించారు. అయితే.. ఈ అధ్యయనం పరిమిత వ్యవధిలో ఉంది. అందుకే దాని విస్తృత ప్రభావం గురించి సమాచారం కనుగొనబడలేదు. లెన్స్‌ ప్రభావం, భద్రత వివిధ వయసుల ఆరోగ్య పరిస్థితులతో మారవచ్చని స్పష్టమైంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×