BigTV English
Advertisement

KONASIMA PRBHALA THEERTHAM : ఘనంగా ప్రభల తీర్థం.. కొలువుదీరనున్న ఏకాదశ రుద్రులు..

KONASIMA PRBHALA THEERTHAM : ఏపీలో సంక్రాంతి పండుగ సంబురాలు అత్యంత వైభవంగా అంబరాన్నంటేలా సాగుతున్నాయి. భోగి, సంక్రాంతి తర్వాత ఇవాళ కనుమ పర్వదినం సందర్భంగా ప్రబల తీర్థం కన్నులపండుగగా సాగనుంది. ఈ ఉత్సవాలకు కోనసీమ పెట్టింది పేరు. జగన్నతోటలో జరిగే ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలవు. 400ల ఏళ్లనాటి చరిత్రకల ఈ సాంప్రదాయ పండుగను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తీర్థంకావడంతో ఏపీ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలిరానున్నారు.

KONASIMA PRBHALA THEERTHAM :  ఘనంగా ప్రభల తీర్థం.. కొలువుదీరనున్న ఏకాదశ రుద్రులు..

KONASIMA PRBHALA THEERTHAM : ఏపీలో సంక్రాంతి పండుగ సంబురాలు అత్యంత వైభవంగా అంబరాన్నంటేలా సాగుతున్నాయి. భోగి, సంక్రాంతి తర్వాత ఇవాళ కనుమ పర్వదినం సందర్భంగా ప్రబల తీర్థం కన్నులపండుగగా సాగనుంది. ఈ ఉత్సవాలకు కోనసీమ పెట్టింది పేరు. జగన్నతోటలో జరిగే ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలవు. 400ల ఏళ్లనాటి చరిత్రకల ఈ సాంప్రదాయ పండుగను నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన తీర్థంకావడంతో ఏపీ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలిరానున్నారు.


అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామం జగ్గన్నపేటలో ప్రబలు కొలువుదీరనున్నాయి. శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న శైవ క్షేత్రాలున్న ప్రదేశం కోనసీమ జిల్లా. అందుకే ఈ ప్రాంతాన్ని వేదసీమ అని కూడా పిలుస్తారు. అయితే,.. ఈ ప్రబల తీర్థానికి 400 ఏళ్లనాటి చరిత్ర ఉంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు మొసలిపల్లి శివారు జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రులు సమావేశమై.. లోకరక్షణ కోసం చర్చలు జరిపారని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్ధములో కరువు కాటాకాలతో లోకం అల్లాడుతున్న పరిస్థితుల్లో 11 గ్రామాల రుద్రులు ఈ జగ్గన్నతోటలో లోకకల్యాణార్థం సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ఈనాటి వరకు ప్రబల తీర్థాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ కనుమనాడు ఎన్ని అవాంతరాలెదురైనా రుద్రులను ఒక్కచోట చేర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ ఏకాదశరుద్రులు అంబాజీపేట మండలంలోని వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి పుల్లేటికుర్రు అభినవవ్యాఘ్రేశ్వరస్వామి, మొసలిపల్లి మధుమానంతభోగేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరుడు, అలాగే గంగలకుర్రు అగ్రహారం నుంచి -వీరేశ్వరుడు, పెదపూడి మేనకేశ్వరుడు, ఇరుసుమండ ఆనందరామేశ్వరుడు, వక్కలంక-విశ్వేశ్వరుడు, నేదునూరు చెన్నమల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి-చెన్నమల్లేశ్వరస్వామి వారి ప్రబలను కనులవిందుగా అలంకరించి మేళతాళాలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ నామస్మరణలతో గ్రామ గ్రామాల నుంచి జగ్గన్నపేటకు తీసుకువస్తారు. పంట పొలాలను దాటుకుంటూ కిలో మీటర్ల కొద్దీ యువకులు ఎలాంటి అలసట లేకుండా.. మధ్యలో గోదావరి పాయ, కౌశిక కాలువ దాటి ఈ తోటలోకి ప్రబలను తీసుకువస్తారు. ప్రబలు పొలాలు, కాలువ దాటే సమయంలో ఈ ఘట్టాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వరి పంట పొలాన్ని దాటి ప్రబలను మోసుకువస్తుంటే.. ఆ భూ యజమాని ఆపరమేశ్వరుడు తమ చేలగుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారట. అలా ప్రబలు తమ పొలాల్లో నుంచి వెళితే ధన ధాన్యాలతో తులతూగుతామని నమ్ముతారట.


ఇక ఈ ప్రబల తీర్థం సందర్భంగా మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు.. మిగిలిన గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు. అందుకే ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నాముందే తోటకు చేరుకుని అందరూ రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశరుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు. ఈవ్యాఘ్రేశ్వరుడుకి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పూర్వకంగా ఒక్కసారిలేపి మళ్లీ కిందకుదించుతారు. ఇక ఈ ప్రబల తరలింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా దారి పొడవునా పోలీసుల బందోబస్తుతోపాటు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు.

Related News

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Big Stories

×