BigTV English

Brain Mapping : కీలకమైన బ్రెయిన్ మ్యాపింగ్ సక్సెస్..

Brain Mapping : కీలకమైన బ్రెయిన్ మ్యాపింగ్ సక్సెస్..


Brain Mapping

Brain Mapping : టెక్నాలజీ ద్వారా మనిషి శరీరంలోని ప్రతీ అవయవాన్ని క్షుణ్ణంగా పరీక్షించే సౌలభ్యం లభిస్తోంది. మనిషి మెదడును కూడా ఇలాంటి టెక్నాలజీతోనే క్షుణ్ణంగా పరీక్షించవచ్చు. అంతే కాకుండా బ్రెయిన్‌లో స్టోర్ అయ్యి ఉన్న మెమొరీని కూడా స్టడీ చేయడానికి బ్రెయిన్ మ్యాపింగ్ అనే టెక్నిక్ అందుబాటులో ఉంది. కేవలం మనిషి మెదడు మాత్రమే కాకుండా ఏ ప్రాణి మెదుడను అయినా దీనితో స్టడీ చేయవచ్చు. తాజాగా శాస్త్రవేత్తలు ఈ బ్రెయిన్ మ్యాపింగ్‌లోనే ఒక అద్భుతాన్ని సృష్టించారు.

మెదడు అనేది ఆలోచనలు చేయడానికి, మెమోరీని స్టోర్ చేయడానికి మాత్రమే ముఖ్యంగా ఉపయోగించబడుతుంది. కేవలం మనిషి మెదడు మాత్రమే కాదు.. ఏ ప్రాణి మెదడు అయినా ఇంతే. అందుకే ఈ మెదడు కదలికలను తెలుసుకోవడానికి బ్రెయిన్ మ్యాపింగ్ అనే టెక్నాలజీని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు మనిషి మెదడుపై బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. దీంతో పాటు మరెన్నో ఇతర ప్రాణులపై కూడా బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ఒకటి తాజాగా సక్సెస్ అయ్యింది.


తాజాగా ఒక కీటకం బ్రెయిన్ మ్యాపింగ్‌ను శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశారు. ఇది న్యూరోసైన్స్‌లోనే ఒక ల్యాండ్ మార్క్ అని వారు చెప్తున్నారు. అంతే కాకుండా దీని ద్వారా మెదడులోని ఆలోచనలకు మరింత దగ్గరగా చేరుకోవచ్చని వారు అంటున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం బ్రెయిన్ మ్యాపింగ్ టెక్నిక్‌లోనే అడ్వాన్స్ స్టేజ్‌కు వెళ్లినట్టే అని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇన్‌సెక్ట్ మెదడులోని ప్రతీ న్యూరల్ కనెక్షన్‌ను క్షుణ్ణంగా డయాగ్రామ్ గీసి స్టడీ చేశారు. ఈ బ్రెయిన్ మోడల్.. మనుషులు బ్రెయిన్ మోడల్‌కంటే సైంటిఫిక్‌గా చాలా భిన్నంగా ఉందని వారు కనిపెట్టారు.

కీటకం బ్రెయిన్ మ్యాపింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవ్వడంతో భవిష్యత్తులో బ్రెయిన్ మీద చేసే పరిశోధనల్లో ఇది కీలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముందుగా మనమేంటో కనుక్కోవాలంటే మన ఆలోచనలను ఏంటో కనుక్కోవాలని వారు చెప్తున్నారు. అందుకే భవిష్యత్తులో న్యూరో సిస్టమ్ కనెక్షన్స్, కనెక్టోమిక్స్ వంటి సబ్జెక్ట్స్ గురించి స్టడీ చేయడానికి బ్రెయిన్ మ్యాపింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. 1970 నుండి మొదలయిన ఈ బ్రెయిన్ మ్యాపింగ్ పరిశోధనలు తాజాగా అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకున్నాయి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×