Big Stories

IND Vs AUS : గిల్ సెంచరీ.. క్రీజులో కోహ్లీ.. భారీ స్కోర్ దిశగా భారత్..

IND Vs AUS : అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిస్తోంది. గిల్ అద్బుత సెంచరీ, కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా కూడా భారీ స్కోర్ సాధించే దిశగా పయనిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 36/0 తో మూడో రోజు ఆట ప్రారంభించి భారత్ తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోర్ 74 పరుగుల వద్ద హిట్ మ్యాన్ (35) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ , పుజారా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో వికెట్ కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే గిల్ టెస్టుల్లో రెండో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత పుజారా (42) స్పిన్నర్ మర్ఫీకి దొరికిపోయాడు.

- Advertisement -

పుజారా అవుట్ తర్వాత కోహ్లీతో కలిసి గిల్ మూడో వికెట్ కు 58 పరుగులు జోడించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన గిల్ .. చివరకు 128 పరుగులు చేసి లైయన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. కోహ్లీ (59 బ్యాటింగ్), జడేజా ( 16 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్ ,మర్ఫీ, లయన్ తలో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంకా భారత్ 191 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో నాలుగో రోజు ఆట కీలకంగా మారనుంది. భారత్ ఇదే జోరును కొనసాగిస్తే మ్యాచ్ పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

కోహ్లీ 14 నెలల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో 16 ఇన్నింగ్స్ ల తర్వాత విరాట్ అర్థ సెంచరీ చేశాడు. ఇది టెస్టుల్లో కోహ్లీకి 29వ హాఫ్ సెంచరీ. కోహ్లీ సెంచరీ కోసం క్రికెట్ ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ టెస్టుల్లో ఇప్పటి వరకు 27 సెంచరీలు బాదాడు. విరాట్ టెస్టుల్లో సెంచరీ కొట్టి మూడేళ్లు దాటిపోయింది.

FOR MORE UPDATES PLEASE FOLLOW : Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News