Anaswara Rajan: హీరో, హీరోయిన్లు సినిమాల షూటింగ్ సమయంలో పూర్తిగా దర్శకుల మాట వింటారు అనేది అవాస్తవం. చాలావరకు హీరో, హీరోయిన్లకు నచ్చినట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్, టైమింగ్స్ మారుతూ ఉంటాయి. అయినా కూడా సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అంతా కలిసికట్టుగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా అంతా అడ్జస్ట్ అయ్యి ఒక సినిమాను పూర్తి చేసిన తర్వాత హీరోయిన్ వల్లే ఆ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోందని దర్శకుడు వాపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన ఈ యంగ్ బ్యూటీ.. ప్రస్తుతం దర్శకుడిని ఇబ్బందిపెట్టే వరకు వెళ్లిందా అంటూ అప్పుడే తనపై నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు ప్రేక్షకులు.
తీవ్రమైన ఆరోపణలు
మలయాళ ఇండస్ట్రీని ఏలేస్తున్న యంగ్ బ్యూటీల్లో అనస్వరా రాజన్ (Anaswara Rajan) ఒకరు. ప్రస్తుతం అక్కడ అనస్వరాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నెలకు ఒక సినిమా లేదా రెండు నెలలకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తోంది అనస్వరా. అలాంటి అనసర్వా.. దర్శకుడు దీపూ కరుణాకరన్ (Deepu Karunakaran)తో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్’ అనే సినిమా చేసింది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం వల్లే రిలీజ్ ఆలస్యమవుతూ వస్తుందని తాజాగా తనపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు దర్శకుడు.
సహకారం లేదు
‘‘షూటింగ్ సమయంలో అనస్వరా నాకు చాలా సపోర్ట్ చేసింది. సినిమా చాలాసార్లు ఆగిపోతుంది అన్న సమయంలో నాతో నిలబడి నేను మీతో ఉన్నాను, సినిమా పూర్తి చేద్దాం అనేది. కానీ షూటింగ్ పూర్తయ్యి ప్రమోషన్స్‌కు వచ్చేసరికి తను అస్సలు సహకరించకపోవడం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ మూవీ ఆడియో రైట్స్ రూ.10 లక్షలకు అమ్ముడుపోయాయి. ఒక పాటను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. పాట విడుదలయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయమన్నారు. కానీ అనస్వరా చేయలేదు. దానివల్ల ఆ మ్యూజిక్ కంపెనీ నన్ను ఒత్తిడికి గురిచేసింది. నేను ఈ విషయంపై అనస్వరాకు ఫోన్ చేస్తే చూద్దాంలే అని చెప్పి పెట్టేసింది’’ అని చెప్పుకొచ్చాడు దీపూ కరుణాకరన్.
Also Read: తమిళ దర్శకులు హీరోయిన్లను అలా చూస్తారు.. జ్యోతిక షాకింగ్ స్టేట్‌మెంట్
అసోసియేషన్‌లో ఫిర్యాదు
‘‘ఇప్పటివరకు సినిమా నుండి నాలుగు పాటలు విడుదలయ్యాయి. అనస్వరా ఫ్యాన్స్ హ్యాండిల్ చేసే పేజ్ నుండి ఈ పాటలు ప్రమోట్ అయ్యాయి కానీ తను మాత్రం దీనిపై ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. తన పేజ్‌లో ఎన్నో సినిమాలను ప్రమోట్ చేస్తుంది కానీ ఈ సినిమాకు అలా ఎందుకు చేయలేదో నాకు అర్థం కావడం లేదు. అనస్వరా మధర్‌తోర, మ్యానేజర్‌తో కూడా నేనా చాలాసార్లు మాట్లాడాను. ఒకానొక సందర్భంలో తనను అడుక్కున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపై తన ఇష్టం అంటూ తన తల్లి కూడా చేతులెత్తేశారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికైనా ప్రమోషన్ చేస్తుందేమో చూస్తాను. నేను ఇంకా ఈ విషయంపై అసోసియేషన్‌కు ఏమీ చెప్పలేదు’’ అని తెలిపాడు దర్శకుడు.