BigTV English

Clothing water : బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకంటే అరిష్టమా….

Clothing water : బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకంటే అరిష్టమా….

Clothing water : బట్టలు ఉతికిన తర్వాత నీళ్లను కాళ్ల మీద పోసుకుంటే దరిద్రమని మన పెద్దోళ్లు చెబుతుంటారు. ఇంట్లో విడిచిన బట్టల మీద కూర్చున్నా మంచిది కాదని కూడా చెబుతారు. మనం చేసే పనులకు దుస్తులే సాక్ష్యం. బట్టలు అలంకరణ మాత్రమే కాదు. కొన్ని బట్టల వల్ల మనకు చెడు కూడా జరుగుతుంది. ఏదో ఒక పని కోసం రోజంతా బయట తిరిగి ఇంటికొస్తుంటాం. అలా వెళ్లినప్పుడు ముందు దిష్టి కలిగేది ఆ ప్రభావం ఉండేది ప్రధానంగా బట్టలపైనే .


కొంతమంది గృహిణులు బట్టలు ఉతికిన తర్వాత నీళ్లు కాళ్ల మీద పోసుకుంటూ ఉంటారు. తెలిసో తెలియక కొంతమంది అలా చేస్తూ ఉంటారు . ఇందులో పెద్ద తప్పేమీ ఉందన్నప్రశ్నలు వేస్తుంటారు. కానీ అది సరికాదు. మురికి పట్టిన బట్టలు ఉతికిన నీళ్లు అనాలోచితంగా కాళ్ల మీద పోసుకో కూడదు. అలా చేయటం వాళ్ల ఆడవాళ్ల పుట్టింటి వాళ్లకు నష్టం జరుగుతుందట. ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు, చేతులకు పగుళ్లూ వస్తుంటాయి. వందలో తొంబై శాతంమంది వారు ఈ కింద తరగతి చెందిన స్త్రీలే ఉంటారు. అలాంటి మహిళల్లో ఎక్కువమంది కి ఖచ్చితంగా కాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి . వారిలో పది శాతం చదువుకున్న లేదా అందం పట్ల జాగ్రత్త, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు బట్టలు ఉతికిన నీటిని మలినమైనవీ, క్రిములున్న వాటిని కాళ్లపై పోసుకోవడం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనారోగ్యాన్ని కలుగు చేస్తాయి. అప్పుడు అడ్డం పడితే భర్త భార్యను పుట్టింటికి పంపిస్తుంటారు. ఆ పై బాధలు పడేది పుట్టింటి వాళ్లే కదా. కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లి, తండ్రీ కోరుకుంటారు.


అలా కాళ్ల మీద బట్టలు ఉతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో అలా చేయకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు.

Tags

Related News

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Big Stories

×