BigTV English

Implantable Fuel Cell : శరీరంలోని గ్లూకోస్‌తో ఫ్యూయల్ సెల్‌కు ఛార్జింగ్.

Implantable Fuel Cell : శరీరంలోని గ్లూకోస్‌తో ఫ్యూయల్ సెల్‌కు ఛార్జింగ్.
Implantable Fuel Cell

Implantable Fuel Cell : డయోబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంది. ఒక్కసారి డయాబెటీస్ బారినపడితే.. జీవితాంతం దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. అందులోనూ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్లకు ఇన్సులిన్ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వారు ఎప్పుడూ ఇన్సులిన్ పంప్స్‌ను అందుబాటులో పెట్టుకోవాల్సిందే. అలా ఇబ్బందులు పడుతున్నవారి కోసమే శాస్త్రవేత్తలు ఇంప్లాంటెబుల్ ఫ్యూయల్ సెల్‌ను తయారు చేశారు.


కేవలం డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు మాత్రమే కాదు.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా పేస్‌మేకర్స్ అనే పరికరాన్ని ఎప్పుడూ తమ శరీరంపై అమర్చుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారికి ఇన్సులిన్ పంప్స్‌లాగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి పేస్‌మేకర్స్ ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలంటే బ్యాటరీలు కావాలి. కొందరు సింగిల్ యూజ్ బ్యాటరీలను ఉపయోగిస్తే.. మరికొందరు రీచార్జెబుల్ బ్యాటరీలను ఎంచుకుంటారు.

ఇన్సులిన్ పంప్స్, పేస్‌మేకర్స్ వంటి పరికరాలు ఉపయోగిస్తున్న వారి కోసమే శాస్త్రవేత్తలు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. అదే ఇంప్లాంటెబుల్ ఫ్యూయర్ సెల్. మనిషి శరీరంలో ఉండే గ్లూకోజ్ ద్వారా దీనికి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అందుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ సెల్ తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయున్నారు. ఫ్యూయల్ సెల్‌ను ఆర్టిఫిషియల్ బెటా సెల్స్‌తో కలిపి దీనిని డెవలప్ చేశారు. ఇది ఒక్క బటన్‌తో ఇన్సులిన్‌ను అందించడంతో పాటు బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.


మామూలుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు కావాల్సిన దానికంటే ఎక్కువగా కార్బోహైడ్రోట్స్‌ను తీసుకుంటారు. దీని వల్లే ఒబిసిటీ, డయోబెటీస్‌తో పాటు మరెన్నో దీర్ఘకాలక వ్యాధుల సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారి శరీరంలో మోతాదుకంటే ఎక్కువగా ఉండే మెటాబొలిక్ ఎనర్జీతో కరెంటును తయారు చేయాలనే ఆలోచన తమకు వచ్చిందంటూ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. బయోమెడికల్ పరికరాలకు కరెంటు అందించడానికి వారి ఒంట్లో ఉండే ఎనర్జీని ఉపయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

ఇంప్లాంటెబుల్ ఫ్యూయల్ సెల్‌ అనేది ఒక చిన్న టీ బ్యాగ్ ఆకారంలో ఉంటుంది. ఇది చర్మంలోపల ఇంప్లాంట్ చేయబడుతుంది. ఇందులో ఉండే ఆల్గినేట్ శరీరంలోని ఫ్ల్యూయిడ్‌తో కలిసి, టిష్యూలో నుండి గ్లూకోజ్‌ను లోపలికి వెళ్లేలాగా చేస్తుంది. ఇన్సులిన్ పంప్స్ బదులుగా ఈ ఇంప్లాంటెబుల్ ఫ్యూయల్ సెల్ అనేది ఎప్పటికప్పుడు తనకు తానుగా ఛార్జ్ చేసుకుంటూ ఇన్సులిన్‌ను పేషెంట్లకు అందించడం అనేది అందరికీ ఉపయోకరంగా మారుతుందని దీని గురించి తెలిసిన వారు అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×