BigTV English

Devaragattu Banni festival: దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. కర్రల ఫైటింగ్‌లో హింస.. 70 మందికి గాయాలు

Devaragattu Banni festival: దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. కర్రల ఫైటింగ్‌లో హింస.. 70 మందికి గాయాలు

Devaragattu Banni festival: దసరా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఉమ్మడి కర్నూలు జిల్లా దేవరగట్టుకు చాలామంది పయనమవుతారు. ఎందుకంటే దేవరగట్టులో జరిగే బన్నీ ఫెస్టివల్‌కు ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వేలాది మంది వెళ్తారు. ఈసారి జరిగిన సమయంలో మళ్లీ హింస ప్రజ్వరిల్లింది. ఏకంగా 70 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.


ఉమ్మడి కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా వేడుకల బన్నీ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటి మాదిరిగా ఆదివారం కూడా సంప్రదాయం ప్రకారం బన్నీ ఉత్సవం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కర్రల సమయంలో ఇద్దరు వర్గాల వారు కొట్టుకుంటారు.

ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా హోళగుండ మండలం దేవరగట్టు ప్రాంతం ఈ ఫెస్టివల్‌కు వేదికైంది. అక్కడ కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఉత్సవం విశేష ప్రాముఖ్యత ఉందని అక్కడి స్థానికులు చెబుతారు.


స్వామిని కాపాడుకునే క్రమంలో ఓ వైపు కొత్తపేట భక్తులు- మరోవైపు విరపాపురం గ్రామాల ప్రజలు కర్రలతో ఫైటింగ్‌కు దిగుతారు. ఈ సమయంలో రక్తం చిందితే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు, భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ALSO READ: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!

బన్నీ ఫెస్టివల్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు వైద్య శిబిరాలు సైతం ఉంటాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స అందిస్తారు. చిన్నచిన్న గాయలు బారినపడినవారికి పసుపు రాస్తారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×