BigTV English

Deep Sea Mining : సముద్ర గర్భంలో మైనింగ్.. వాటికోసమే..

Deep Sea Mining : సముద్ర గర్భంలో మైనింగ్.. వాటికోసమే..
Deep Sea Mining


Deep Sea Mining : మైనింగ్ అనేది భూమి లోపల ఉన్న కనిజాలను గుర్తించడానికి, వాటిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. గత కొన్నేళ్లలో మైనింగ్ ద్వారానే ఎన్నో భూమి లోపల దాగున్న ఎన్నో అద్భుతమైన వనరులు బయటపడ్డాయి. అందుకే ఇప్పుడు ఏకంగా చంద్రుడిపైనే మైనింగ్ మొదలుపెట్టాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా డీప్ సీ మైనింగ్ లాంటి వాటికి కూడా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా దాని గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి.

ప్రపంచంలోనే సముద్రాల ఫ్లోర్‌కు అథారిటీగా వ్యవహరించే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ప్రస్తుతం డీప్ సీ మైనింగ్‌కు సన్నాహాలు చేస్తోంది. గ్రీన్ ఎనర్జీకి అవసరమయ్యే వనరులు డీప్ సీలో దొరుకుతాయని ఈ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే డీప్ సీ మైనింగ్‌కు సంబంధించి ముందస్తు పనులు పూర్తవ్వగా మధ్యలో దీని కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇక త్వరలోనే మళ్లీ మైనింగ్‌ను ప్రారంభించాలని ఈ అథారిటీ అనుకుంటోంది. మైనింగ్ వల్ల సముద్రాల్లో నివసించే ప్రాణులకు, ఎకోసిస్టమ్స్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అథారిటీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే దీనిని ఆచరణలో పెట్టడానికి ఇంత సమయం పట్టింది.


ఓషన్ సీబెడ్‌లో ఉండే వనరులను, కనిజాలను బయటికి తీయడం కోసం డీప్ సీ మైనింగ్ ఉపయోగపడుతుంది. ఇందులో మూడు వివిధ రకాల మైనింగ్ పద్ధతులు ఉంటాయి. సముద్ర గర్భంలో బ్యాటరీల తయారీకి ఉపయోగపడే నికెల్, కోబాల్ట్ లాంటి మరెన్నో వనరులు లభిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో బ్యాటరీలు తయారు చేయడం ద్వారా సెల్‌ఫోన్స్, కంప్యూటర్స్ లాంటి వాటికి రెన్యూవబుల్ ఎనర్జీ అందుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికీ డీప్ సీ మైనింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీని మరింత మెరుగుపరచాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

డీప్ సీ మైనింగ్ కోసం 2021లోనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ మైనింగ్ వల్ల సముద్రాలకు, సముద్ర గర్భాలకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని కోర్టుకు నివేదికను అందించాలని సంస్థలను కోరింది. 2023 జులై వరకు మైనింగ్ జరపకూడదని ఆదేశించింది. ఇక ప్రస్తుతం డీప్ సీ మైనింగ్‌కు సమయం దగ్గర పడింది. అందుకే పలు కనిజ సంస్థలు.. ఈ మైనింగ్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే భూమిలో కనిజాలను మైనింగ్‌తో కొల్లగొట్టినట్టుగా సముద్ర గర్భాలను కూడా కొల్లగొడతారని పర్యావరణవేత్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×