BigTV English

Pawan Kalyan Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్..

Pawan Kalyan Instagram :  ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ ఎంట్రీ.. ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్..
pawan


Pawan Kalyan Official Instagram Account(Tollywood Celebrity News) : చాలామంది నటీనటులు ఎంతమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నా వారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించడానికి ఇష్టపడరు. ఇప్పటికే ప్రతీ సినీ పరిశ్రమలో క్రేజ్ ఉన్నా కూడా సోషల్ మీడియాలో మెయింటేయిన్ చేయని హీరోలు కొందరు ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కానీ తాజాగా పవన్.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంతా చకచకా ఫాలో బటన్ కొట్టేస్తున్నారు.

వపన్ కళ్యాణ్.. సినిమాల్లో ఎంత ఎనర్జీతో కనిపిస్తారో.. రాజకీయాల్లో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. పవర్ స్టార్‌కు సంబంధించిన సినీ, రాజకీయ విషయాల గురించి ఆయన టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నా కూడా తన పేరు మీద కొన్నిరోజుల క్రితం వరకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. కొన్నాళ్ల క్రితమే ట్విటర్‌లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అప్పటివరకు తన భావాలను, ఫ్యాన్స్‌తో పంచుకోవాలి అనుకుంటున్న విషయాలను ఎక్కువగా ఫేస్‌బుక్‌లోనే పంచుకునేవారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.


తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారని తెలిసిన ఫ్యాన్స్ అంతా తనకు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. అకౌంట్ క్రియేట్ చేసిన నిమిషంలోనే 1 వేయి ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు పవన్. ఆ తర్వాత సెకను సెకనుకు తన ఫాలోవర్స్ కౌంట్ పెరుగుతూనే ఉంది. ఇక ఈ స్పీడ్‌తో కొనసాగితే.. ఒక్కరోజులోనే మిలియన్ ఫాలోవర్స్‌ను దక్కించుకునే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. తన ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా రాజకీయ విషయాలు పంచుకోవడానికే ఉపయోగిస్తాడని అందరూ అనుకుంటున్నారు. అంతే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ బయో కూడా రాజకీయానికి సంబంధించిందే పెట్టాడు. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’ అనే బయోతో పవన్ కళ్యాణ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. ఫ్యాన్స్‌ను పలకరించనుంది. ట్విటర్‌లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఓపెన్ చేశాడు పవన్.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×