Kuberaa Movie : తమిళ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ రూపోందింది. ఇక
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా మూవీని నిర్మించారు. గతనెలలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదట బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. పాజిటివ్ టాక్ ను అందుకున్నా కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
‘ కుబేర ‘ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..
ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ రవి పై భారీ అంచనాలు ఉంటాయి. ఇద్దరు హీరోల అభిమానులు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో సినిమాని స్పెషల్గా ప్రమోట్ చేస్తారు. ఈ మధ్య ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది కుబేర.. తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ముగిసినట్టే. గత రెండు మూడు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ షేర్ వసూళ్లు కూడా రావడం ఆగిపోయింది. ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిందంటే.. తమిళనాడు ప్రాంతం లో మాత్రం ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా పరిగణించవచ్చు. ఆ ప్రాంతంలో 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. సగం మాత్రమే వసూల్ చేసింది.
మిగిలిన ఏరియాల్లో ఎంతంటే..?
కుబేర నైజాం లో 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఫుల్ రన్ లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక లో 13 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి 30 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తానికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 136 కోట్లు వసూలు చేసింది. 69 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..
Also Read : పాప చాలా టాలెంట్ గురూ.. ఫిదా అవ్వాల్సిందే మామా..
మూవీకి పెట్టిన బడ్జెట్..?
టాప్ టెక్నీషియన్లు వర్క్ చేయడం, రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల వరకు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ఇక బిజినెస్ ను చూస్తే..రూ.65 కోట్ల బిజినెస్ జరగ్గా రూ.20 కోట్లు, తెలుగులో రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.. అన్ని స్టేట్స్, ఓవర్సీస్ కలిపి రూ.5 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.120 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది.. మొత్తానికి మంచిగా వసూల్ చేసింది..