BigTV English
Advertisement

Revu Movie: ‘రేవు’ సినిమాను చూసి.. నేనే రివ్యూ రాస్తా: దిల్ రాజ్

Revu Movie: ‘రేవు’ సినిమాను చూసి.. నేనే రివ్యూ రాస్తా: దిల్ రాజ్

Revu Movie trailer launch Event: సంహిత్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత మురళీ గింజుపల్లి – నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించిన ‘రేవు’ సినిమా ఆగస్టు 23న గ్రాండ్ గా రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. నిర్మాణ సూపర్ విజన్ గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.


ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. ‘సినిమాలు తీయడం గొప్పకాదు.. ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం ఇంపార్టెంట్. రేవు సినిమా కాన్సెప్ట్ బాగుంది. ఈ సినిమాలో అంతా కొత్త కొత్త వాళ్లే నటించారు. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తే సక్సెస్ ఒక్క శాతమే ఉంటుంది. ఫెయిల్యూర్ 99 శాతం ఉంటుంది. అయినా కూడా ప్రొడ్యూసర్ మురళీ వాంటివారు కొత్త వాళ్లతో సినిమా తీశారు. ప్రభు, పర్వతనేని రాంబాబు వంటివారు ఉండటం వల్లే మేమంతా ఇక్కడకు వచ్చాం. వారు ఈ సినిమా గురించి వివరించారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి, నేను ముందుండి ఈ సినిమాను నడిపించాలని ఫిక్సయ్యాను. అయితే, ఇంతవరకు వీళ్లు సినిమాలకు రివ్యూ రాసేవాళ్లు. ఇప్పుడు వీళ్ల సినిమాకు నేను రివ్యూ రాస్తా’ అంటూ ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ..’ రేవు చిత్రం మంచి సక్సెస్ సాధించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

అనంతరం జర్నలిస్టు ప్రభు మాట్లాడారు. ‘తక్కువ బడ్జెట్ లో ఎంత అద్భుతంగా సినిమాను తీయొచ్చు అనే దానికి ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తది. సెన్సార్ వాళ్లు కూడా ఈ సినిమాను చూసి ఎంతో మెచ్చుకున్నారు’ అంటూ ఆయన అన్నారు. నిర్మాత మురళీ మాట్లాడుతూ.. రేవు సినిమా ప్రతి ఇంటిలోకి వెళ్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Also Read: ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ డైరెక్టర్ ను గుర్తుపట్టండి చూద్దాం..

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయని, ఆ లిస్ట్ లో రేవు సినిమా కూడా ఉంటుందన్నారు. అతిపెద్ద విజయం సాధిస్తదని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
రేవు సినిమాను చూసి ప్రతి ఒక్కరూ రంగస్థలం చూసినట్టుగా ఫీలవుతారన్నారు ప్రసన్న కుమారు. రేవు చిత్రం గొప్ప చిత్రమవుతుందని అన్నారు. దామోదర ప్రసాద్, భరత్ భూషమ్ కూడా మాట్లాడారు. రేవు ట్రైలర్ చాలా బాగుందని, ఖచ్చితంగా సినిమా హిట్టవుతుందన్నారు.

డీఎస్ రావు, రేలంగి నర్సింహారావులు మాట్లాడుతూ.. రేవు కథను తీసుకోవడమే ఒక ఛాలెంజింగ్ అన్నారు. మత్స్యకారుల జీవితంపై తీసిన ఈ సినిమాకు ఇంతమంది సపోర్ట్ లభించండం ఫుల్ హ్యాపీగా ఉందన్నారు. ఇది చాలా వినూత్నమైన చిత్రమన్నారు. సినిమాకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.

యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. రేవులో అంతా అద్భుతంగా నటించినట్లు అనిపిస్తుందన్నారు. పాటలు కూడా బాగున్నాయన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందన్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×