BigTV English

Lakshmi Devi:లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

Lakshmi Devi:లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదా?

Lakshmi Devi:లక్ష్మీదేవి పాదాలను పూజించకూడదంటారు. అన్నమాచార్యులవారు బ్రహ్మకడిగిన పాదము అని చెప్పారు. అలాగే బలిచక్రవర్తి కూడా వామనుని పాదాలను జలముతో తన భార్యయైన వింధ్యావళి నీళ్ళు పోస్తుండగా కడిగి ఆ స్వామి అడిగిన మూడు అడుగుల నేలను దానం ఇవ్వగా ఆస్వామి పాదాలతో ప్రపంచాన్నంతటినీ కూడా ఈపాదంతో ఆక్రమించాడు. మరొక పాదంతో విశాల ఆకాశమంతా తానుగా దర్శింపజేసి ఆ మూడోపాదాన్ని బలిచక్రవర్తి శిరస్సున ఉంచాడు. కాబట్టి మనము భగవంతుని పాదములను ఆశ్రయించాలి.


నిజానికి పరమేశ్వరి – పరమేశ్వరుడు, లక్ష్మీదేవి – శ్రీమన్నారాయణుడు, అంతా ఒక్కటే. కాబట్టి ఎటువంటి అనుమానమూ లేకుండా అమ్మవారి పాదములు పూజించవచ్చు. కొల్హాపుర్ లో అమ్మవారి పాదాలు బంగారు తాపడంతో చేయబడి ఉంటాయి. బాసరకు వెళ్ళినా మరింకే అమ్మవారి క్షేత్రానికి వెళ్ళినా నమస్కరిస్తే ఆ సమయంలో అర్చకుడు శఠారిని మన శిరస్సుపైన ఉంచుతారు. తలవంచి మనం నమస్కారం పెడతాం. ఆ శఠారి మనలో ఉండే మొండితనం – దానిని తొలగించేవి పరమాత్ముని పాదములు. దానిమీద పరమాత్మ పాదములే ఉంటాయి.

లక్ష్మీదేవి సన్నిధానంలోకి వెళ్ళి ఆ అమ్మవారికి నమస్కరించిన తరువాత అర్చకులు మనశిరస్సుపై ఉంచే శఠారి పైన అమ్మవారి పాదాలే ఉంటాయి.
పాదపూజ అని చెప్తాం. పరమాత్మను మనం అర్చించే సమయంలో ఆ పరమాత్మ విశాల విశ్వమంతా కూడా వ్యాపించి ఉంటాడు. పాదములను దర్శిస్తే చాలు పరమాత్మను దర్శించినట్లే. ఇటువంటి భావంతో అయ్యవారికైనా, అమ్మవారికైనా పాదపద్మాలకు నమస్కరించవలసిందే.


Ellora : ఎల్లోరాలో ఏలియన్స్ సంచరించాయా……

Lavish Flowers : సంపంగి పూలతో పూజ ఫలితాలివి

Related News

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Bad Karma: చెడు కర్మలు తొలగి కోట్లు సంపాదించాలా..? అయితే ఈ దానాలు చేయండి

Devotional Tips:  ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే

Chanakya niti: చాణక్య నీతి – ఆ ఐదు లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Big Stories

×