BigTV English

Money Purse : మనీ పర్సు ఎలా ఉండకూడదో తెలుసా

Money Purse : మనీ పర్సు ఎలా ఉండకూడదో తెలుసా

Money Purse : ప్రపంచంలో చాలా మందికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మనిషి కనిపించడు. కొందరికి ఆరోగ్య సమస్యలు, మరికొంతమంది రుణ సమస్యలు ఇలా చాలా ఉంటాయి. కొంతమంది సమస్యలున్నా లోకానికి తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు. ఇంకొంతమంది చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. డీలా పడిపోతుంటారు. ఎక్కుమంది ఎదుర్కొనే సమస్య డబ్బు.


ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది డబ్బులను పర్సులో ఉంచడం లేదు. ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లావాదేవీలను చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే బాగా అలవాటు పడిపోయారు కూడా. అయితే ఇప్పటికీ కొందరు వ్యక్తులు వాలెట్ ను వాడుతున్నారు. అయితే అలా వాడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం, పర్సును ఎప్పటికీ ఖాళీగా ఉంచకూడదు. మీ వద్ద డబ్బుకు ఢోకా లేకుండా ఆదాయం పెరగాలంటే కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవాలి. ..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు వాడే పర్సులో లక్ష్మీదేవి ఫోటో లేదా శ్రీ యంత్రాన్ని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవాలనుకునే వారు అమ్మవారు కూర్చున్న ఫొటోనే వాడాలని గుర్తుంచుకోండి.పర్సును పరిశుభ్రంగా..ఉంచుకోవాలి.


పర్సు అంటేనే డబ్బును నిల్వ చేయడం. అయితే కొందరి పర్సులు అప్పుడప్పుడు ఖాళీగా ఉండొచ్చు. అలా ఉండకుండా మీ పర్సులో వెండి నాణెలను ఉంచండి. కనీసం ఒక రూపాయి నాణెం అయినా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ పర్సును భద్రపరిచేందుకు సరైన స్థలాన్ని ఎంచుకోవాలి.

మీరు వాడే పర్సులో పాత రూపాయి కరెన్సీ నోటును ఉంచుకోవచ్చు. అలాగే రావిచెట్టు ఆకును పెట్టుకోవడం వల్ల లాభం కలిగిస్తుంది. ఎందుకంటే రావి చెట్టును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తామర గింజలను, 21 బియ్యపు గింజలను కూడా పెట్టుకుంటే మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

పర్సుల్లో చెత్త కాగితాలను పెట్టుకోరాదు. పర్సును కొనాలంటే గురువారం రోజును కొనుగోలు చేయాలి. సూర్యాస్తమ లోపు కొనుక్కోవాలి. ఐశ్వర్య ప్రాప్తి రుద్రకాళి మహిమ ఓం హ్రీం, శ్రీం, శ్రీ గురుచరణ స్పర్శ స్వాహా అనే మంత్రి రాసి పర్సులో పెట్టండి. మీ పర్సులో డబ్బులు వస్తూనే ఉంటాయి. మరో విషయంలో పర్సులో 20 రూపాయల నోట్లను ఉంచకూడదని గుర్తుంచుకోండి.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×