Big Stories

Musk Net Worth Slips Below 200 Billion: పిట్ట దెబ్బకు మస్క్ సంపద మటాష్!

Musk Net Worth Slips Below 200 Billion: పిట్ట మీది మోజు కొంపముంచింది. ప్రపంచ అగ్ర కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ ప్రస్తుత సంపద 194.8 బిలియన్‌ డాలర్లు. 622 బిలియన్ డాలర్ల విలువైన టెస్లాలో 15 శాతం ఉన్న మస్క్ వాటా క్రమంగా తగ్గిపోతున్నట్లు యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

- Advertisement -

2022 జనవరి నుంచి ట్విటర్‌లో కొద్దికొద్దిగా షేర్లు కొనుక్కుంటూ వచ్చిన మస్క్‌… ఏప్రిల్‌ నాటికి 3 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 9 శాతానికి పైగా వాటాలు దక్కించుకున్నాడు. అదే నెలలో ట్విట్ట‌ర్‌ కొనేందుకు బిడ్ వేశాడు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇచ్చి… ఏకంగా 44 బిలియన్‌ డాలర్లకు కంపెనీని కొనేస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు. మస్క్ నిర్ణయం ఆర్థిక నిపుణులందర్నీ ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ విలువ అంత లేదని… ఎక్కువ డబ్బు వెదజల్లి మస్క్ ట్విట్టర్ కొంటున్నాడని ప్రచారం జరగడంతో… మస్క్ కంపెనీ అయిన టెస్లా, దాదాపు సగం మార్కెట్ విలువను కోల్పోయింది.

- Advertisement -

తాజాగా టెస్లాలో 4 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను మస్క్‌ అమ్మేశాడు. ఈ విషయం యూఎస్‌ సెక్యూరిటీ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ ఫైలింగ్‌ ద్వారా బయటపడింది. ట్విటర్ కొనేందుకు… 3.9 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన 19 మిలియన్ షేర్లను మస్క్ అమ్మినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ట్విట్టర్ కొన్నాక మస్క్ దానిపైనే దృష్టి కేంద్రీకరించడం, టెస్లాను పట్టించుకోకపోవడంతో… అందులో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళన గురయ్యారు. దీనికి తోడు ఈవీ మార్కెట్‌లో టెస్లాకు పోటీగా ఇతర ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుండటం… భవిష్యత్తులో అవి టెస్లాకు పోటీ వస్తాయేమోననే అనుమానంతో… ఇన్వెస్టర్లు టెస్లాలో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నారు. అందుకే… మస్క్‌ సంపద మంచులా కరిపోతోందని చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్కే మొదటి స్థానంలో ఉండటం విశేషం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News