Edible Oil Prices to go up : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత విపరీతంగా పెరిగిపోయిన వంటనూనె ధరలు… ఈ మధ్యే కాస్త దిగొచ్చాయని ఊరట చెందారు… సామాన్యులు. కానీ… పండుగ సీజన ఇలా ముగిసిందో లేదో… వంటింట్లో మళ్లీ మంట పెట్టింది… కేంద్రం. పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచుతున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చింది.
ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెంచింది… కేంద్రం. అలాగే ఆర్బీడీ పామాయిల్ దిగుమతి సుంకం టన్నుకు 905 డాలర్ల నుంచి 962 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ సుంకం కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు ఎగసింది. ఇప్పటికే మార్కెట్లో లీటర్ ధర వంద రూపాయలకు పైగానే ఉన్న పామాయిల్ ధర… తాజాదా పన్నుల పెంపుతో మరింత భారం కానుంది. పామాయిల్ ధరలు పెరిగితే… ఆ ప్రభావం ఇతర నూనెల మీద కూడా ఉండే అవకాశం ఉంది.
భారీగా పెరిగిన వంట నూనె ధల్ని తగ్గించేందుకు వీలుగా… ఈ ఏడాది ఆరంభంలో ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి పన్నును రద్దు చేసింది… కేంద్రం. ప్రస్తుతం ప్రతి 15 రోజులకు ఒకసారి బంగారం, వెండి దిగుమతి ధరలతో పాటు… ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి ధరలనూ సవరిస్తోంది… కేంద్రం. ప్రపంచంలోనే ఎక్కువగా వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు… రష్యా, ఉక్రెయిన్, మలేషియా, ఇండోనేషియా నుంచే అధికంగా సరఫరా జరుగుతోంది.