Big Stories

Good news to Google users : గూగుల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌

Good news to Google users యూజర్లకు బంపరాఫర్ ఇచ్చింది… గూగుల్. ఇప్పటివరకూ ఒక్కో వ్యక్తిగత ఖాతాకు 15GB స్టోరేజీ సామర్థ్యమే ఉండగా… దాన్ని ఏకంగా 1TB సామర్థ్యానికి పెంచబోతోంది. ప్రతి గూగుల్ వర్క్‌ స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు… తన తాజా బ్లాగ్ పోస్టులో తెలిపింది. దీంతో గూగుల్‌ స్టోరేజ్‌, జీమెయిల్‌ లాంటివి నిండిపోతాయనే బాధ లేకుండా… ఎన్ని ఫైళ్లనైనా… ఎంత డేటానైనా దాచుకోవచ్చు.

- Advertisement -

ప్రతి గూగుల్ వర్క్‌ స్పేస్ వ్యక్తిగత ఖాతా 1TB సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాను 1 టీబీ స్టోరేజ్ కు అప్‌గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ తెలిపింది.

- Advertisement -

గూగుల్ డ్రైవ్ లో దాదాపు 100 రకాల ఫైళ్లను… పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైళ్లను స్టోర్ చేసుకునేందుకు 1TB స్టోరేజ్ అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్‌లా మార్చుకోకుండానే ఎడిట్ ఆప్షన్ ను ఎనేబుల్ చేయనుంది. అంతేకాదు… గూగుల్ డ్రైవ్ కు మాల్ వేర్, రాన్సమ్‌వేర్, స్పామ్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను సంస్థ అందించబోతోంది. దాంతో… ఇన్నాళ్లూ అరకొర స్టోరేజ్ తో నెట్టుకొస్తున్న వాళ్లు… స్టోరేజ్ కొసమే నాలుగైదు వ్యక్తిగత గూగుల్ ఖాతాలు నిర్వహిస్తున్న వాళ్లు… సంస్థ ఇచ్చిన బంపరాఫర్ తో ఎగిరి గంతేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News