BigTV English

Elaichi Benefits : కంటిచూపును మెరుగుపరిచే యాల‌కులు

Elaichi Benefits : కంటిచూపును మెరుగుపరిచే యాల‌కులు

Elaichi Benefits : యాల‌కులు.. వీటి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం మన వంటింట్లో పోపు డబ్బాల్లో ఇవి కనిపిస్తుంటాయి. ఇంట్లో ఎలాంటి తీపి వంటకమైనా అందులో యాలకులు ఉంటే ఆ రుచే వేరు. అంతేకాకుండా బిర్యానీలు, మాంసాహారాల్లో కూడా నాలుగు యాలకులు పడాల్సిందే. ఇవి చక్కటి రుచితో పాటు వాసన కూడా ఇస్తాయి. అయితే ఈ యాలకులతో అనేక రోగాలు నయం అవుతాయని వైద్యులు అంటున్నారు. ఒక యాలకను స్పూన్‌ తేనెతో రోజుకు ఒక‌సారి తింటే కంటి చూపుబాగుంటుంది. గ్లాస్ నీటిలో కొద్దిగా యాల‌కుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మ‌రిగించి అందులో ఉప్పు వేసుకుని గోరువెచ్చగా తాగితే గొంతు స‌మ‌స్యలు తగ్గుతాయి. యాల‌కుల‌తో చేసిన డికాష‌న్‌ తాగితే విరేచ‌నాలు పోతాయి. యాల‌కుల పొడి, పిప్పళ్ల పొడి కొద్దిగా తీసుకుని నెయ్యితో తీసుకుంటే క‌డుపునొప్పి త‌గ్గుతుంది. యాల‌కులు, బెల్లం వేసి త‌యారు చేసిన డికాష‌న్‌ రోజుకు 3 సార్లు తాగితే త‌ల‌ తిర‌గ‌డం త‌గ్గుతుంది. వెక్కిళ్లు తగ్గాలంటే నీటిని మ‌రిగించి అందులో యాలకులు, పుదీనా ఆకులు వేసి 5 నిమిషాల తర్వాత తాగాలి. గ్లాస్ గోరు వెచ్చని పాల‌లో తేనె, యాల‌కుల పొడి వేసి తాగితే మ‌గ‌వారిలో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య రాకుండా ఉంటుంది. అర‌టి పండ్లతో యాలకులు కలిపి తింటే వాంతులు త‌గ్గుతాయి. అతి మ‌ధురం, యాల‌కుల పొడి క‌లిపి తేనెతో టీస్పూన్ తింటే పంటి నొప్పి తగ్గుతుంది. నీటిలో పావు టీస్పూన్ యాల‌కుల పొడి వేసి బాగా మరిగించి తాగితే డిప్రెషన్‌ తగ్గుతుంది. యాలకుల టీ తాగితే త‌ల‌నొప్పి, అజీర్ణం స‌మ‌స్యలు పోతాయి. యాల‌కుల పొడి, సోంపు గింజ‌ల పొడి కలిపి క‌ప్పు గోరు వెచ్చని నీటిలో క‌లిపి రోజుకు రెండుసార్లు తాగితే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. యాల‌కుల పొడి, అల్లం పొడి, సోంపు గింజ‌ల పొడి నీటిలో కలిపి తాగితే గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×