Big Stories

Cognitive Disorders : ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు తప్పవు..!

Cognitive Disorders : అధిక ఉప్పును తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకు తెలియకుండానే ఈ ఉప్పు అనేది ఇంకా ఎన్నో విధాలుగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శారీరికంగానే కాదు.. మానసికంగా కూడా ఉప్పు అనేది మనిషికి మంచిది కాదని తేల్చారు. దీనిని ఎక్కువగా ఆహార పదార్థాలలో కలిపి తినడం వల్ల కలిగే మానసిక సమస్యలపై వారు తాజాగా దృష్టిపెట్టారు.

- Advertisement -

డిమెన్షియా అనేది ఒక మానసిక సమస్య. ఇది మనిషి ఆలోచనా శక్తిపై, జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు ఇదివరకే బయటపెట్టారు. జపాన్‌లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో డిమెన్షియా బయటపడుతుంది. ప్రస్తుతం దీనికి తగిన చికిత్స కానీ, మందులు కానీ లేవు. అంతే కాకుండా డిమెన్షియా అనేది ముందస్తుగా కనిపెట్టడం కూడా కష్టమే. అసలు చికిత్స అనేది లేని అతికొద్ది ఆరోగ్య సమస్యల్లో డిమెన్షియా కూడా ఒకటి.

- Advertisement -

మనిషి తినే ఆహారం కూడా తన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అందులో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా వారిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఇది ఎక్కువగా హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుందని తెలిపారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే ఉప్పును తీసుకోవడం తగ్గించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ప్రకటించింది. రోజుకు దాదాపు 5 గ్రాముల కంటే తక్కువగానే ఉప్పును తినాలని సూచించింది.

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్‌ను కలిగించే ఒక సెల్ డ్యామేజ్ అయ్యి.. అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతే కాకుండా దీనికి ఒక ప్రొటీన్ కూడా కారణమన్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. హైపర్‌టెన్షన్‌తో పాటు ఇతర మానసిక సమస్యలు కలగడానికి ఉప్పు అనేది ముఖ్య కారణాల్లో ఒకటిగా మారతుందని, అందుకే ఏ వయసు వారైనా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే మంచిదని వైద్యులతో పాటు శాస్త్రవేత్తలు కూడా సలహా ఇస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News