
Unconscious : పేషెంట్లకు ఒకానొక సమయంలో కచ్చితంగా అనెస్థీషియా లాంటి మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా సర్జరీల సమయంలో ఈ డ్రగ్ చాలా ఉపయోగపడుతుంది. కానీ అనస్థీషియా వల్ల కానీ, లేక ఇంకే ఇతర కారణాల వల్ల కానీ అపస్మారకంగా మారిన పేషెంట్ల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా స్టడీ చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో వారు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నారు.
అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్లను స్టడీ చేయడం అనేది కష్టమైన విషయమని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. వారు చేసే పరిశోధనలో పెషేంటే ఒక సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్‌పై వారి పరిశోధన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోవడం ఇలాంటి కేసులలో కష్టమని తెలిపారు. శాస్త్రవేత్తలు చేయాలనుకున్న ఈ పరిశోధన కోసం కొందరు వాలంటీర్లు స్వచ్ఛంధంగా ముందుకొచ్చారు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనుషులు వారికి ఏదో ఒక విధంగా రెస్పాండ్ అవుతారని, కానీ ఎక్కువ కమాండ్స్ ఇవ్వడం వల్ల వారి అనస్థీషియా పవర్ తగ్గిపోతుందని వారు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
అనస్థిషియా ఇచ్చేవారికి ముందే దాని గురించి చెప్పడం వల్ల ఆ ప్రక్రియను డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మామూలుగా స్మారక స్థితిలో ఉన్నప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలుసుకోవడం సులభమే కానీ మత్తుమందు వల్ల ఇందులో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవడం కొంచెం కష్టమని అన్నారు. అయితే అనస్థీషియా ఇచ్చిన వారికి ఎలాంటి శబ్దం వినిపించకుండా కేవలం వారి కమాండ్స్‌ను వినిపించినప్పుడే ఈ ప్రయోగాలు సక్సెస్ అవుతాయన్నారు.
2014లో స్లీప్ రీసెర్చర్స్ ముందుగా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుండి ఎన్నో రకాలుగా సెడేటర్లు తీసుకుంటున్న వారి మెదడు కదలికలను గమనిస్తూ ప్రతీ పరిశోధనలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ ప్రయోగాల ద్వారా ఇన్సోమ్నియాను ట్రీట్ చేయవచ్చని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. అంతే కాకుండా ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే కోమాకు కూడా చికిత్సను కనుక్కోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
Bandi Sanjay: ప్రీతి శవానికి ట్రీట్మెంట్ చేశారు.. కవిత వాచ్‌కు ఉన్నంత విలువ కూడా లేదా?