BigTV English
Advertisement

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం నిపుణుల సలహాలు..

Mental Health: మానసిక ఆరోగ్యం కోసం నిపుణుల సలహాలు..

Mental Health: శారీరిక ఆరోగ్యం అనేది ఒక మనిషి జీవనానికి ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈమధ్యకాలంలో పెరిగిన టెక్నాలజీతో శారీరిక ఆరోగ్యాన్ని సైతం కనిపెడుతూ ఉండవచ్చు కానీ మానసిక ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉండడం మాత్రం కష్టమయిపోయింది. అందుకే వైద్యులతో పాటు పలువురు మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సైతం మానసిక ఆరోగ్యం కోసం రకరకాల సూచనలను అందిస్తూ ఉంటారు.


మనిషి టీనేజ్ నుండి యవ్వనానికి మారుతున్న క్రమంలో మెదడుపై ఎంతో ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యం, సంబంధాలు, కుటుంబం, ఉద్యోగం, సంపాదన.. ఇలా ఎన్నో ఆలోచనలు ఒకేసారి తన మెదడును కమ్మేస్తాయి. అయితే మనిషి మెదడు గురించి స్పష్టంగా తెలుసుకోవడం కోసం 5 వేల ఏళ్ల క్రితమే పతాంజలి యోగసూత్రములు అనే పుస్తకం రచించబడింది. అందుకే మనిషి మెదడులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అయిదు భాగాల గురించి చెప్పబడింది. అవే ప్రమాణ్, విప్రయాయ్, వికల్ప, నిద్ర, స్మృతి.

మనిషి జీవనం సాఫీగా కొనసాగాలంటే ఈ అయిదు వృత్తులు సక్రమంగా సాగాలని ఆ సూత్రాలలో ఉంది. ఈ అయిదు సూత్రాలలో ఏ ఒక్కటి కూడా సరిగా జరగకపోయినా.. మనిషి బాధలో మునిగిపోతాడని యోగసూత్రములు చెప్తున్నాయి. అయితే మనిషి మానసిక ఆరోగ్యంలో భాగంగా సేవాగుణం అనేది ముఖ్యమని, సేవాగుణం ఉన్నవారి మానసిక ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుందని తెలిపాయి. నలుగురితో కలిసిపోడం, నలుగురితో పంచుకోవడం లాంటి గుణాలు ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు సైతం నిర్ధారించారు.


ప్రస్తుత రోజుల్లో నేను అనే స్వార్థం మనుషుల్లో ఎక్కువయిపోయిందని, అలా కాకుండా నలుగురి గురించి ఆలోచిస్తే మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అంతే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్మార్ట్ ఫోన్స్ మధ్య బ్రతుకుతున్న ఈ కాలంలో స్వార్థం అనేది మరింత పెరిగిపోయిందని వారు తెలిపారు. మెదడులో ఆలోచనా శక్తి తగ్గిపోయి, కంప్యూటర్ వైర్లపై ఆధారపడే జీవితాలను జీవిస్తున్నామని వాపోతున్నారు. మొత్తంగా మనుషుల్లో హ్యామన్ ఫ్యాక్టర్ అనేది పోయిందని నిపుణులు బయటపెట్టారు.

ఒకప్పటితో పోలిస్తే.. మనుషుల్లో పెరిగిన స్వార్థం కారణంగానే క్రిమినల్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరిగిపోయిందని స్టడీలో తేలిందని నిపుణులు విమర్శిస్తున్నారు. మరికొందరిలో డిప్రెషన్, ఆందోళన లాంటివి పెరిగిపోయాయని చెప్తున్నారు. మనిషి ఏ పని చేయాలన్నా ముందుగా మెదడే సంకేతాలు పంపిస్తుంది కాబట్టి ఆ మెదడును ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది ఎంతైనా ముఖ్యమని నిపుణుల వాదన. యోగా లాంటివి చేయడం వల్ల మెదడు అనేది మనిషి కంట్రోల్‌లో ఉంటుందని వారు సలహా ఇస్తున్నారు.

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×