BigTV English

Crazey Foods : ఆ ఆహార పదార్థాలకు యువతలో పెరుగుతున్న క్రేజ్..

Crazey Foods : ఆ ఆహార పదార్థాలకు యువతలో పెరుగుతున్న క్రేజ్..
Crazey Foods

Crazey Foods : ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు వచ్చాయి. చెప్పాలంటే ఒక రకంగా అప్పటికి, ఇప్పటికీ పోలికే లేదు. ఈరోజుల్లో చాలావరకు కొత్త కొత్త ఆహార పదార్థాలను రుచి చూడడానికి చాలావరకు ఉత్సాహం చూపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఒక కచ్చితమైన పద్ధతిలో తయారు చేసిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ శాతం మంది ఆసక్తి చుపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై తాజాగా ఒక సర్వే కూడా జరిగింది. అందులో పలు విషయాలు బయటికి వచ్చాయి.


టెక్నాలజీలో మార్పులు వచ్చినట్టుగా మనుషుల ఆహారపు అలవాట్లు, అభిరుచుల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అందులోనూ ఫెర్మెంటేషన్ తో తయారైన ఆహారాన్ని తినడానికే ఎక్కువమంది ఇష్టపుతున్నారట. 77 శాతం ఫెర్మెంటేషన్ పదార్థాలకు ఓట్ వేసినట్టు తెలుస్తోంది. సర్వే ప్రకారం 40 శాతం యువత ఫెర్మెంటేషన్ ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారని తేలింది. అందులో కొంతమంది ఫెర్మెంటేషన్ వల్ల ఏర్పడుతున్న లాభాలను గ్రహించి తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి సిద్దమవుతున్నారు. ఇలాగే ఉంటే ఫెర్మెంటేషన్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

2022 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు 2500 కు పైగా యువతను ఈ సర్వే కోసం ఎంపిక చేసుకున్నారు. వారి ద్వారా ఫెర్మెంటేషన్పై పెరుగుతున్న క్రేజ్ గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఫెర్మెంటేషన్ ద్వారా ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ శాతం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి కూడా ఏ నష్టం జరగదని తెలుస్తోంది. ఆహార పదార్థాల వల్ల వాతావరణ మార్పులకు పరిష్కారం దొరుకుతుంది అంటే అలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి యువత ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాదాపు 61 శాతం యువత ఇలాగే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.


52 శాతం మంది యువత వాతావరణ మార్పులను అరికట్టడానికి, కాలుష్యాన్ని అదుపు చేయడానికి తమ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. అందుకోసమే ట్రెడిషనల్ ఫార్మింగ్ పద్ధతిలో తయారవుతున్న ఆహారాన్ని తీసుకోవడానికి వారు ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే వాతావరణ మార్పుల విషయంలో కానీ, ఆహారపు అలవాట్ల మార్పిడి విషయంలో కానీ కచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ హస్తం ఉంటుంది. ఒక విధంగా మారుతున్న ఆహారపు అలవాట్లు సైన్స్ అండ్ టెక్నాలజీని మనుషులకి మరింత దగ్గర చేస్తున్నాయని, ఇది సంతోషకరమైన మార్పు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×